Kalki2898AD : కల్కీ సినిమా నుంచి దీపికా పదుకునే అవుట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రభాస్ హీరోగా, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన కల్కి 2898 AD దేశవ్యాప్తంగా ఘన విజయాన్ని సాధించింది. విజువల్స్, కథ, స్టార్ కాస్ట్ అన్నీ కలిసి ఈ సినిమాను ప్రత్యేకంగా నిలబెట్టాయి. సహజంగానే సీక్వెల్‌పై కూడా అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సీక్వెల్‌లో హీరోయిన్ దీపికా పదుకొనే భాగం కాబోరని అధికారికంగా ప్రకటించారు. ప్రొడక్షన్ టీమ్ స్టేట్‌మెంట్‌లో..
Also Read : Manchu Lakshmi: కుటుంబంలో గొడవలపై రియాక్ట్ అయిన మంచు లక్ష్మి..
Also Read
- Nani: నా కెరీర్లోనే అత్యంత కష్టమైన సినిమా ఇదే.. జడల బరువుపై నాని సంచలన వ్యాఖ్యలు!
- Nani: మా డైరెక్టర్ ఎవరినీ కొట్టలేదు.. నాని కీలక వ్యాఖ్యలు
- The Paradise: ట్రైలర్ లేకుండానే థియేటర్లలోకి నాని ‘ది ప్యారడైజ్’!
- Hanuman Ansh: త్రివిక్రమ్ చేతుల మీదుగా తెలుగులోకి 'హనుమాన్ అంశ్' - సెప్టెంబర్ 18న గ్రాండ్ రిలీజ్!
“మేము జాగ్రత్తగా పరిశీలించి ఈ నిర్ణయం తీసుకున్నాం. మొదటి భాగంలో దీపికా ఎంతో కష్టపడ్డారు. కానీ క్రియేటివ్‌గా మన భాగస్వామ్యం కొనసాగలేదు. కల్కి 2898 AD లాంటి సినిమా పూర్తి అంకితభావాని, సమయాన్ని డిమాండ్ చేస్తుంది. ఈ నేపథ్యంలో విడిపోవాలని నిర్ణయించుకున్నాం. ఆమె భవిష్యత్తు ప్రాజెక్టులకు మా శుభాకాంక్షలు” అని పేర్కొన్నారు. ప్రజంట్ దీపిక ఒక బిడ్డకు తల్లి అయిన కారణంగా షూటింగ్ టైమింగ్ లో మార్పులు చేశారు. కల్కి లాంటి పెద్ద ప్రాజెక్ట్ కి సమయంతో పని ఉండదు. కానీ దీపిక ఇలాంటి నిబంధనలు పెట్టుకుంటే ఇబ్బందులు ఎదురవుతాయి. అందుకే ముందు జాగ్రత్తగా మూవీ టీం ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
దీంతో సీక్వెల్‌లో హీరోయిన్ ఎవరు అనే చర్చ మొదలైంది. అభిమానులు కొత్త హీరోయిన్ పేరును తెలుసుకోవాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. త్వరలోనే యూనిట్ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఇక కల్కి 2898 AD సీక్వెల్ ప్రీ-ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి. మరింత భారీ స్థాయిలో, విస్తృతమైన విజువల్స్‌తో ఈ సీక్వెల్‌ను నాగ్ అశ్విన్ తెరకెక్కించనున్నారని సమాచారం. దీపికా అవుట్ అయిన వార్తతో అభిమానుల్లో కొత్త ఊహాగానాలు మొదలయ్యాయి.
This is to officially announce that @deepikapadukone will not be a part of the upcoming sequel of #Kalki2898AD.
After careful consideration, We have decided to part ways. Despite the long journey of making the first film, we were unable to find a partnership.
And a film like…
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) September 18, 2025
తాజావార్తలు
-
Rain Alert: బ్రిక్స్ సదస్సు వేళ ఢిల్లీకి భారీ వర్ష సూచన
-
Nani: నా కెరీర్లోనే అత్యంత కష్టమైన సినిమా ఇదే.. జడల బరువుపై నాని సంచలన వ్యాఖ్యలు!
-
New Excise Policy: 2026-27 ఎక్సైజ్ పాలసీ.. ఏడాది పాటు లైసెన్సులు రెన్యువల్..
-
Nani: మా డైరెక్టర్ ఎవరినీ కొట్టలేదు.. నాని కీలక వ్యాఖ్యలు
-
Packard Bell: మార్కెట్లోకి పాకర్డ్ బెల్.. ఏసర్ నుంచి ఆరెంజ్, పర్పుల్, గ్రీన్, ఎల్లో కలర్స్‌లో అందుబాటులోకి..
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?