యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తాజాగా “మహాసముద్రం” ట్రైలర్ పై ప్రశంసలు కురిపించారు. “మహా సముద్రం” దసరా స్పెషల్‌గా అక్టోబర్ 14 న గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధంగా ఉంది. ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ అజయ్ భూపతి ‘మహా సముద్రం’ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. యాక్షన్ అండ్ రొమాంటిక్ డ్రామా “మహా సముద్రం”ను ఎకె ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది. ఇందులో అదితి రావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. జగపతి బాబు, రావు రమేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా కనిపించబోతున్నారు. చాలా సంవత్సరాల తర్వాత సిద్ధార్థ్ టాలీవుడ్ లో రీఎంట్రీ ఇస్తున్నాడు. అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రానికి చైతన్ భరద్వాజ్ సంగీతం అందించారు.
Read also : ఆకాష్ పూరి “రొమాంటిక్” రిలీజ్ కు ముహూర్తం ఖరారు
ఇటీవల విడుదలైన “మహా సముద్రం” ట్రైలర్‌కు అన్ని వర్గాల నుండి మంచి స్పందన వచ్చింది. విడుదలైన రెండవ రోజు కూడా ట్రైలర్ యూట్యూబ్ టాప్ లో ట్రెండింగ్ అవుతోంది. ఇప్పటికే ఈ ట్రైలర్ కు 6.5 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. తాజాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఈ ట్రైలర్ బాగుందంటూ ప్రశంసించారు. “మహా సముద్రం ట్రైలర్ ఇంటెన్స్ అండ్ ఆసక్తిని కలిగిస్తుంది. శర్వానంద్, సిద్ధార్థ్ తో పాటు చిత్రబృందానికి నా శుభాకాంక్షలు” అంటూ ట్రైలర్‌ను ఫేస్బుక్లో షేర్ చేశారు.