Prabhas : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనెకు వరుస షాక్ లు తగులుతున్నాయి. ఆ మధ్య స్పిరిట్ నుంచి సందీప్ రెడ్డి తీసేస్తే.. ఇప్పుడు ఏకంగా కల్కి-2 నుంచి నాగ్ అశ్విన్ తీసేశాడు. దెబ్బకు అమ్మడి మీద ట్రోలింగ్ మామూలుగా జరగట్లేదు. అయితే ఇక్కడ ఒక కామన్ పాయింట్ ఉంది. ఈ రెండు సినిమాలు ప్రభాస్ చేస్తున్నవే. డైరెక్టర్లు వేరు కావచ్చు. కానీ హీరో ప్రభాస్ నటిస్తున్నవే కావడంతో.. ఆమెను తీసేయడం వెనక ప్రభాస్ హస్తం ఏమైనా ఉందా అనే టాక్ సోషల్ మీడియాలో నడుస్తోంది. దీంతో గతంలో ప్రభాస్ దీపిక మీద చేసిన కామెంట్లు ఇప్పుడు మరోసారి వైరల్ అవుతున్నాయి. మిర్చి సినిమా తర్వాత ప్రభాస్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. అందులో మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు, ఎవరితో నటించాలి అనుకుంటున్నారు అనే ప్రశ్న ఎదురైంది.
Read Also : Bigg Boss 9 : అమ్మాయిలను ఈడ్చిపడేసిన సుమన్ శెట్టి.. ఇలా అయ్యావేంటయ్యా..
నా ఫేవరెట్ హీరోయిన్ దీపిక పదుకొనె. ఆమెతో ఒక్కసారి అయినా సినిమా చేయాలని ఉందంటూ అప్పట్లో ప్రభాస్ చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. దీపిక ప్రభాస్ ఫేవరెట్ హీరోయిన్ కావచ్చు.. కానీ మితిమీరిన కండీషన్లు పెడితే ఎవరిని ఎక్కడ పెట్టాలో ప్రభాస్ కు బాగా తెలుసంటున్నారు ఫ్యాన్స్. ఆల్రెడీ కల్కి మొదటి పార్టులో దీపికను ప్రభాస్ భరించాడు. అది కూడా ఆమె మీదున్న అభిమానంతోనే. కానీ ఆమె పెడుతున్న కండీషన్లు, అడుగుతున్న రెమ్యునరేషన్లు, కోరుతున్న గొంతెమ్మ కోరికలకు ఎవరికైనా చిరాకు వేస్తుందని టాలీవుడ్ లో టాక్ నడుస్తోంది. ప్రభాస్ లాంటి హీరో సినిమాలో ఛాన్స్ అంటే ఎవరైనా ఎగిరి గంతేస్తారు. ఎందుకంటే ప్రభాస్ రేంజ్ అలాంటిది. కానీ లేనిపోని కండీషన్లతో ఇలా దిక్కు, మొక్కు లేకుండా పోవడం ఏంటని దీపికను తెగ ట్రోల్స్ చేస్తున్నారు.
Read Also : Mirai : ఆ సినిమాలతో రూ.140 కోట్లు నష్టపోయా : టీజీ విశ్వ ప్రసాద్