Prabhas: ఆ ఒక్క పని చేసుంటే దీన్ని మించిన సినిమా వచ్చేది కాదేమో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రభాస్ మాస్ సినిమాలు అనగానే అందరికీ ఛత్రపతి, మిర్చి, బుజ్జిగాడు లాంటి సినిమాలు గుర్తొస్తాయి కానీ అసలైన మాస్ సినిమా అంటే ప్రభాస్ డై హార్డ్ ఫాన్స్ మాత్రం ‘మున్నా’ అని చెప్తారు. వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో దిల్ రాజు ప్రొడ్యూస్ చేసిన మున్నా మూవీ 2007లో రిలీజ్ అయ్యింది. ఇలియానా హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో ప్రభాస్ స్టైలింగ్ సూపర్బ్ గా ఉంటుంది. హెయిర్ స్టైల్ నుంచి డ్రెస్సింగ్ వరకూ ప్రతి విషయంలో ప్రభాస్ పిచ్చ క్లాస్ గా కనిపిస్తూనే మాస్ గా ఉంటాడు. ఆరున్నర అడుగుల కటౌట్ ని వంశీ పైడిపల్లి పర్ఫెక్ట్ గా వాడుకుంటూ అదిరిపోయే ఎలివేషన్స్ ఇచ్చాడు. హరీష్ జైరాజ్ మ్యూజిక్ మున్నాని ఆ ఇయర్ లో బెస్ట్ ఆల్బమ్ గా మార్చింది. రైన్ ఫైట్ కి అయితే ప్రభాస్ ఫాన్స్ థియేటర్ కి కేకలు వేశారు. ప్రకాష్ రాజ్-ప్రభాస్ మధ్య ఉండే ఎపిసోడ్స్, ఇంటర్వెల్ బ్లాక్, మున్నా ఎవరో రివీల్ అయ్యే సీన్… ఇలా చెప్పుకుంటూ పోతే మున్నా ఫస్ట్ హాఫ్ అంతా సూపర్ హిట్ సినిమాకి ఏ మాత్రం తక్కువ కాని సీన్స్ ఉంటాయి. సెకండ్ హాఫ్ లో మదర్ సెంటిమెంట్ విషయంలో వంశీ పైడిపల్లి కొంచెం జాగ్రత్త తీసుకోని ఉంటే మున్నా మూవీ బ్లాక్ బస్టర్ అయ్యేది. మదర్ సెంటిమెంట్ బ్యాక్ ఫైర్ అవ్వడంతో మున్నా సినిమా నెగటివ్ రిజల్ట్ ని ఫేస్ చేసింది.
Read Also: Rashmika: నేషనల్ క్రష్ కొత్త అవతారం… తట్టుకోవడం కష్టమే
Also Read
టాక్ బాగోలేకపోయినా మున్నా చాలా సెంటర్స్ లో మంచి కలెక్షన్స్ ని రాబట్టిందని, 75 రోజులు ఆడిన ఈ మూవీ కారణంగా ఎలాంటి నష్టం రాలేదని దిల్ రాజు స్వయంగా చెప్పాడు అంటే ఒకవేళ మున్నా మూవీ హిట్ అయ్యి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో అర్ధం చేసుకోవచ్చు. ఈ మూవీ రిలీజ్ అయ్యి 16 ఏళ్లు అయిన సంధర్భంగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి పోస్ట్ వచ్చింది. ఈ పోస్టర్ చూడగానే నాస్టాల్జియా ఫీలింగ్ కలిగిన ఫాన్స్, సెకండ్ హాఫ్ లో కొంచెం జాగ్రత్తలు తీసుకోని ఉంటే ఇండస్ట్రీ హిట్ అయ్యేది, నెక్స్ట్ టైమ్ ప్రభాస్ తో చేసే సినిమాని పాన్ ఇండియా రేంజులో చెయ్యండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే మున్న సినిమా వచ్చిన నాలుగేళ్లకే దిల్ రాజు ప్రొడక్షన్ లో ప్రభాస్ మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా చేశాడు, ఈ మూవీ సూపర్ హిట్ అయ్యింది. ప్రభాస్ తో మళ్లీ ఇన్నేళ్ల తర్వాత సినిమాని ప్లాన్ చేస్తున్నట్లు దిల్ రాజు ఇటివలే అనౌన్స్ చేశాడు. ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తాడు అనే మాట వినిపిస్తున్న ఈ మూవీ గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్నాయి.
Celebrating 16 years of Rebel Star #Prabhas & @directorvamshi’s action-packed family entertainer #Munna ❤️🔥@Ileana_Official @Jharrisjayaraj @SVC_official #16YearsForMunna pic.twitter.com/b42fLFE0yr
— Sri Venkateswara Creations (@SVC_official) May 2, 2023
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..