ఆదిపురుష్ సినిమాతో మరోసారి తన బాక్సాఫీస్ స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు ప్రభాస్. రియల్ పాన్ ఇండియా హీరో అనిపించుకున్నాడు. ఫస్ట్ వీకెండ్‌లోనే 340 కోట్లు రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది ఆదిపురుష్. అయితే మండే మాత్రం కలెక్షన్స్‌లో భారీ డ్రాప్ కనిపించింది. మండే రోజు కేవలం 35 కోట్ల గ్రాస్ వసూళ్లను మాత్రమే రాబట్టింది. మొత్తంగా నాలుగు రోజుల్లో 375 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్టు ప్రకటించారు మేకర్స్. అయితే ఫ్రైడే వరకు ఆదిపురుష్ కలెక్షన్స్ ఓ మోస్తరుగానే ఉండే ఛాన్స్ ఉంది కానీ వీకెండ్‌లో మాత్రం వసూళ్ల వర్షం కురిపించే అవకాశం ఉంది. ఎందుకంటే నెక్స్ట్ వీక్ కొత్త సినిమాలు వచ్చే వరకు థియేటర్లో ఆదిపురుష్‌దే హవా ఉండనుంది. ఇదిలా ఉంటే.. ఆదిపురుష్‌తో ఎన్నో రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాడు ప్రభాస్. హైయెస్ట్ ఓపెనింగ్‌తో పాటు.. ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్‌తో దుమ్ముదులిపేశాడు.
ఇక నాలుగు సినిమాలతో ట్రిపుల్ సెంచరీ కొట్టిన హీరోగా మరో కొత్త రికార్డ్ సెట్ చేసుకున్నాడు డార్లింగ్. ఇప్పటికే బాహుబలి1, బాహుబలి2, సాహో సినిమాలు 300 కోట్ల క్లబ్‌లో ఉన్నాయి. చివరగా వచ్చిన రాధే శ్యామ్ మాత్రం 214 కోట్ల దగ్గరే ఆగిపోయింది కానీ ఇప్పుడు ఆదిపురుష్ మూడు రోజుల్లోనే 300 కోట్ల లిస్ట్‌లో చేరిపోయింది. ఇప్పటి వరకు ఏ హీరోకి కూడా నాలుగు సినిమాలతో 300 కోట్లు రాబట్టిన ఘనత లేదు. అంతెందుకు.. ఓవరాల్‌గా వంద కోట్లు రాబట్టడమే బడా బడా హీరోలకు కష్టంగా ఉంది. ప్రభాస్ మాత్రం వందల కోట్లు కొల్లగొడుతూ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నాడు. ఇక అప్ కమింగ్ మూవీస్.. సలార్, ప్రాజెక్ట్ కెతో కనీవినీ రికార్డులను క్రియేట్ చేయబోతున్నాడు డార్లింగ్. ఏదేమైనా.. నాలుగు సార్లు 300 కోట్లు రాబట్టిన ఒకే ఒక్కడు ప్రభాస్ అని చెప్పొచ్చు.