ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి డైరెక్షన్లో “ఫౌజీ” అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించి ముందు నుంచి రకరకాల ప్రచారాలు జరిగాయి. రకరకాల టైటిల్స్ కూడా పెట్టే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. కానీ, ఎట్టకేలకు ముందు నుంచి ప్రచారం జరుగుతున్న విధంగానే “ఫౌజీ” అనే టైటిల్ ఎట్టకేలకు ఈ మధ్యకాలంలో ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేసింది సినిమా టీమ్. ఈ సందర్భంగానే హిందీలో ఇచ్చిన ఒక అప్డేట్ ఆసక్తికరంగా మారింది.
Also Read :Trivikram – Venkatesh : త్రివిక్రమ్ – వెంకటేశ్ హిట్ కలయికకు మరో స్టార్ హీరోయిన్!
అయితే, పద్మ వ్యూహాన్ని గెలవగలిగి, అందులోకి వెళ్ళలేకపోయిన అర్జునుడు కాకుండా, గెలిచిన అర్జునుడిగా, కౌరవుల పక్షాన కాకుండా పాండవుల పక్షాన పోరాడే కర్ణుడిగా, అసలు గురువుని లేకుండా గురువుగా ఫీలైన ఏకలవ్యుడిలా కాకుండా, గురువే లేని ఏకలవ్యుడిగా అంటూ ప్రభాస్ క్యారెక్టర్‌ను డిజైన్ చేసినట్లు అప్పట్లోనే పోస్టర్లో క్లారిటీ ఇచ్చారు. ఇక తాజాగా ఇదే విషయం మీద హను రాఘవపూడి స్పందించారు. ఈ సినిమా, ఒకవేళ కర్ణుడు కనుక కౌరవుల పక్షాన కాకుండా పాండవుల పక్షాన నిలబడి పోరాడి ఉంటే ఎలా ఉంటుంది అనే లైన్‌తో రాసుకున్నానని చెప్పుకొచ్చాడు. దీంతో, ఒక్కసారిగా ఈ సినిమా మీద ఉన్న అంచనాలను మరో లెవల్‌కు తీసుకువెళ్లినట్లు అయింది. చూడాలి ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో. ఇమాన్వి ఇస్మాయిల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది.