Prabhas: రోజురోజుకు టెక్నాలజీ పెరిగిపోతుంది. ఒకప్పుడు అభిమానం అంటే.. సైకిళ్ళపై అభిమాన హీరోల బొమ్మలు వేయించుకోనేవాళ్లు.. పేపర్ లో వచ్చే హీరోల బొమ్మలను కట్ చేసి.. ఇంట్లో తలుపులకు, అద్దాలకు అంటించుకొనేవాళ్లు.. ఏదైనా పండగ వస్తే.. నచ్చిన హీరోల ఫోటోలను గ్రీటింగ్ కార్డులుగా ఇచ్చేవాళ్లు.. ఇక ఇప్పుడు అలాంటివి లేవు. అంతా సోషల్ మీడియా మయంగా మారింది. తమ అభిమాన హీరోను ఎవరైనా ఏదైనా అంటే.. రారా చూసుకుందాం అని ట్విట్టర్ లో వార్ షురూ చేస్తున్నారు. ఇక అభిమానం చూపించడానికి తమ బుర్రలకు పదును పెట్టి.. తమ హీరోల ఫోటోలను ఎడిట్ చేసి.. మేకర్స్ రిలీజ్ చేసే ఫస్ట్ లుక్స్ పోస్టర్స్ కన్నా అందంగా తీర్చిదిద్దుతున్నారు. తమ అభిమాన హీరో ఎలాంటి డ్రెస్ లో బావుంటాడు.. ఏ పాత్రలో ఎలా ఉంటాడు అనేది ఇమాజిన్ చేసుకొని అద్భుతమైన కళతో హీరోల ఫోటోలను ఆర్ట్స్ గా వేస్తున్నారు. ఇక తాజాగా ఈ మధ్య AI టెక్నాలజీ రావడంతో అభిమానులు మరింతగా రెచ్చిపోతున్నారు. కొన్ని యాప్స్ ఉపయోగించి తమ హీరోల ఫేస్ తో తమకు నచ్చినట్లు ఎడిట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇక వాటిని చూస్తే.. నిజంగా ఏ సినిమా పోస్టరో అని అనుకోవడం ఖాయమనిపిస్తుంది.
Bhagavanth Kesari: భగవంత్ కేసరి ట్రైలర్ తో వచ్చేస్తున్నాడు..
ప్రభాస్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్.. ఇలా ఒక్కరిని కూడా వదలకుండా AI యాప్ తో ఎడిట్స్ చేసి ఔరా అనిపిస్తున్నారు. తాజాగా ఒక ప్రభాస్ అభిమాని .. ప్రభాస్ AI ఇమేజెస్ అంటూ ఒక రెండు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అసలు ఆ ఫోటోలు చూస్తుంటే.. అతడి అభిమానం ఎలా ఉందో తెలుస్తోంది. వైట్ కలర్ షర్ట్ లో ప్రభాస్ఊర మాస్ లుక్ అది.. సడెన్ గా చూస్తే అది ఏ సినిమాలో పోస్టరో అనుకుంటారు. ఇక ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. నిజంగా ప్రభాస్ ఈ లుక్ లో ఒక సినిమా చేస్తే.. రికార్డులు గల్లంతే అని కొందరు అంటుండగా .. ఇంకొందరు.. ఓరీ.. మీ ఎడిట్లు పాడుగాను.. జనాలను చంపేస్తారారా..? సడెన్ గా చూసి ఏ సినిమానో అనుకున్నాం అంటూ కామెంట్స్ పెడుతున్నారు.