ప్రభాస్… బాహుబలి సినిమాతో ఇండియాస్ బిగ్గెస్ట్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. బాహుబలి 2 తర్వాత ప్రభాస్ కి హిట్ అనేదే లేకపోయినా ప్రభాస్ నుంచి సినిమా వస్తుంది అంటే బాక్సాఫీస్ దగ్గర కొత్త రికార్డులు క్రియేట్ అవుతున్నాయి, పాత రికార్డులు బ్రేక్ అవుతున్నాయి. ఇతర హీరోల సూపర్ హిట్ సినిమాల రేంజులో ప్రభాస్ ఫ్లాప్ సినిమాల కలెక్షన్స్ ఉంటున్నాయి అంటే ప్రభాస్ మార్కెట్ ఎంత పెరిగిందో అర్ధం చేసుకోవచ్చు. ప్రభాస్ ఏ సినిమా చేసినా అది పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తుంది, భారీ బడ్జట్ తో తెరకెక్కుతుంది.
ప్రస్తుతం ప్రభాస్ సలార్, కల్కి, మారుతీ సినిమాలు చేస్తున్నాడు. ఈ మూడు సినిమాల్లో ఒకటి పాన్ ఇండియా మార్కెట్ ని, ఇంకొకటి పాన్ వరల్డ్ మార్కెట్ ని టార్గెట్ చేస్తున్నాయి. మారుతీతో చేస్తున్న సినిమా అనౌన్స్మెంట్ అవ్వకుండానే జెట్ స్పీడ్ లో షూటింగ్ జరుపుకుంటుంది. అక్టోబర్ 23న ప్రభాస్ బర్త్ డే సంధర్భంగా ఈ మూడు సినిమాల నుంచి అప్డేట్స్ బయటకి వస్తాయి… మరో రెండు సినిమాలు అనౌన్స్ అవుతాయి అని అంతా అనుకున్నారు. ఈరోజు కోసమే చాలా రోజులుగా వెయిట్ చేస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్ కి ఊహించని షాక్ తగిలింది. ఒక సినిమా నుంచి కాదు ప్రభాస్ నటిస్తున్న… నటించనున్న ఏ సినిమా నుంచి కూడా ఒక్క అప్డేట్ కూడా బయటకి రాలేదు. అభిమానులని దృష్టిలో పెట్టుకోని ఏ ప్రొడక్షన్ హౌజ్ కూడా ఒక్క సర్ప్రైజ్ కూడా ఇవ్వలేదు. సింపుల్ గా చెప్పాలి అంటే ప్రభాస్ ఫ్యాన్స్ కి ఇంత నీరసమైన బర్త్ డే ఇప్పటివరకూ రాలేదు.