పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు దేశవ్యాప్తంగా ఎంత క్రేజ్ ఉందన్న విషయానికి ఈ సరికొత్త రికార్డును నిదర్శనంగా చెప్పుకోవచ్చు. 2021 నాటికి నంబర్ వన్ గ్లోబల్ ఆసియా సెలబ్రిటీగా ప్రభాస్ నిలిచాడు. యూకే ఆధారిత ఈస్టర్న్ ఐ వార్తాపత్రిక ప్రచురించిన ప్రపంచంలోని 50 మంది ఆసియా ప్రముఖుల జాబితాలోని తాజా ఎడిషన్‌లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్టార్స్ అందరినీ వెనక్కి తోసేసి ప్రభాస్ అగ్రస్థానంలో నిలవడం విశేషం. వార్తాపత్రిక హాలీవుడ్, సంగీత పరిశ్రమ, టెలివిజన్, సాహిత్యం, సోషల్ మీడియాతో సహా ప్రపంచంలోనిప్రముఖుల పాపులారిటీ ఆధారంగా ఈ లిస్ట్ ను రూపొందించింది. ప్రభాస్ డౌన్ టు ఎర్త్ స్వభావానికి ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికులు ప్రభాస్ కు ఫిదా అయ్యారు. ఇక ప్రస్తుతం ప్రభాస్ రాధే శ్యామ్, ఆదిపురుష్, సలార్, స్పిరిట్‌తో సహా నెక్స్ట్ చిత్రాలపై దృష్టి పెట్టారు.
Read Also : అమ్మ బాబోయ్.. ఈ ‘నిధి’ని తట్టుకోవడం కష్టమే..
2021లో అత్యంత పాపులర్ సెలెబ్రిటీస్ టాప్ 50 జాబితా హాలీవుడ్‌లో ఉత్తమ నటుడిగా ఆస్కార్ నామినేషన్ పొందిన మొదటి నటుడు రిజ్ అహ్మద్ రెండవ స్థానంలో నిలిచాడు. మూడవ స్థానంలో నిలిచిన ప్రియాంక చోప్రా-జోనాస్, నాల్గవ స్థానంలో ఉన్న మిండీ కాలింగ్, శ్రేయా ఘోషల్ (5), ఏడవ స్థానంలో పాకిస్తానీ నటుడు సజల్ అలీ ఉన్నారు. మిగిలిన టాప్ 10లో హాఫ్-ఇండియన్ బ్రిటీష్ పాప్ సూపర్ స్టార్ చార్లీ XCX (8), బ్రిటీష్ నటుడు దేవ్ పటేల్ (9), భారతదేశపు ఫాస్టెస్ట్ రైజ్ స్టార్ షెహనాజ్ గిల్ (10) స్థానాల్లో ఉన్నారు.
Read Also : ఒక ఇంటివాడు కాబోతున్న ప్రభాస్..?
ఈ జాబితాలో ఏజ్ ఎక్కువగా ఉన్న స్టార్ 79 ఏళ్ల అమితాబ్ బచ్చన్ కాగా, ఆయన 32వ స్థానంలో నిలిచారు. 18 ఏళ్ల నటి సుంబుల్ తౌకీర్ ఖాన్ 16వ స్థానాల్లో నిలిచారు. దిల్జిత్ దోసాంజ్ (11), లిల్లీ సింగ్ (12), తాప్సీ పన్ను (14), విజయ్ (15), రుబీనా దిలైక్ (17), అక్షయ్ కుమార్ (18), అర్మాన్ మాలిక్ (19), జమీలా జమీల్ ( 21), మైత్రేయి రామకృష్ణన్ (22), అయేషా సింగ్ (24), ఆదర్శ్ గౌరవ్ (26), షారుక్ ఖాన్ (27), హదికా కియాని (30), రామ్ చరణ్ (33), యుమ్నా జైదీ (35), అనౌష్క శంకర్ (36) ), ఆషి సింగ్ (38), బిలాల్ అబ్బాస్ ఖాన్ (39), స్టీల్ బంగ్లెజ్ (42), అసిమ్ రియాజ్ (44), జకీర్ ఖాన్ (47) స్థానాల్లో ఉన్నారు.