ప్రభాస్ ఇప్పుడు ప్యాన్ ఇండియా స్టార్. ప్రభాస్ కి ఈ రేంజ్ ఇమేజ్ రావటానికి ప్రధాన కారకుడు రాజమౌళి. ‘ఛత్రపతి’తో సూపర్ హిట్ ఇవ్వడమే కాదు ‘బాహుబలి’ సీరీస్ తో ప్రభాస్ ని ప్యాన్ ఇండియా స్టార్ గా మర్చాడు రాజమౌళి. ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్నవన్నీ ప్యాన్ ఇండియా రేంజ్ చిత్రాలే. ఇక రాజమౌళి, ప్రభాస్ కాంబినేషన్ కి ఉన్న గుర్తింపు అంతా ఇంతా కాదు. వీరి కలయికలో సినిమా అంటే హాట్ కేక్ అవుతుందనటంలో ఎలాంటి సందేహం లేదు. అసలు ఇప్పుడున్న పరిస్థితుల్లో వీరి కలయిక సాధ్యమేనా! అంటే అవుననే వినిపిస్తోంది. నిజానికి అటు రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత మహేశ్ తో సినిమా చేయవలసి ఉంది.
Read Also : ‘ఐకాన్’ మళ్ళీ ఆగనుందా!?
ఇక ప్రభాస్ ఇప్పటికే పలు చిత్రాలను ప్రకటించి ఉన్నాడు. వాటిలో బాలీవుడ్ సినిమాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు రాజమౌళి, ప్రభాస్ కలయికలో సినిమాకు ప్రభాస్ మాతృసంస్థలు యువి క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్ సన్నాహాలు చేస్తున్నాయి. ‘రాధే శ్యామ్’ రిలీజ్ కాగానే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఆరంభం అవుతుందట. షూటింగ్ మాత్రం ప్రస్తుతం ప్రభాస్ ఒప్పుకున్న సినిమాలు పూర్తి కాగానే మొదలవుతుందంటున్నారు. మరి ఈ సారి రాజమౌళి ప్రభాస్ ను ఎలా చూపిస్తాడో చూడాలి.