Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, దీపికా పదుకొనే జంటగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం కల్కి2898AD. వైజయంతీ బ్యానర్ పై అశ్వినీదత్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో లోక నాయకుడు కమల్ హాసన్ విలన్ గా కనిపిస్తుండగా.. అమితాబ్ బచ్చన్, దిశా పటానీ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ చిత్రంపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. మే 9 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతోంది కానీ, ఇప్పటివరకు మేకర్స్ ప్రమోషన్స్ మొదలుపెట్టడం లేదు. ఇంకోవిధంగా చెప్పాలంటే.. ప్రభాస్ లాంటి కటౌట్ కు పెద్దగా ప్రమోషన్స్ కూడా అవసరం లేదు. ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇక నిన్ననే ఈ సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్ ను మేకర్స్ అభిమానులతో పంచుకున్నారు. ఇటలీలో సాంగ్ షూటింగ్ జరగనుందని, ప్రభాస్, నాగ్ అశ్విన్, దిశా తో పాటు మిగతా టెక్నీషియన్స్ అందరూ ఈ సాంగ్ షూట్ లో పాల్గొంటున్నట్లు తెలిపారు.
ఇక తాజాగా మేకర్స్.. ఇటలీ జర్నీలోని ఒక అరుదైన క్లిక్ ను అభిమానులతో పంచుకున్నారు. విమానంలో అందగత్తె దిశా.. డార్లింగ్ ను ఫోటో తీస్తూ కనిపించింది. ఇక ఈ ఫోటోను మేకర్స్ షేర్ చేస్తూ.. “ఏ డార్లింగ్ పిక్” ఇటలీ డైరీస్ అంటూ రాసుకొచ్చారు. నిజంగా ఇది డార్లింగ్ పిక్ అనే చెప్పాలి. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ సాంగ్ ఒక రొమాంటిక్ సాంగ్ అని సమాచారం. దిశా.. రొమాంటిక్ సాంగ్స్ కు పెట్టింది పేరు. లోఫర్ సినిమాలో అమ్మడు చేసిన రొమాంటిక్ సాంగ్ ఇప్పటికీ హాట్ హాట్ గా గుర్తుచేస్తూనే ఉంది. మరి ఇప్పుడు డార్లింగ్ తో..ఈ లోఫర్ బ్యూటీ ఏ రేంజ్ లో రొమాన్స్ చేస్తుందో చూడాలి.