పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ క్రేజీ ప్రాజెక్ట్‌ల లైనప్ లతో బిజీబిజీగా ఉన్నాడు. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె కాంబోలో వస్తున్న “ప్రాజెక్ట్ కే” భారతీయ సినిమాల్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్‌లలో ఒకటి. ‘మహానటి’ దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న ఈ ఫ్యూచరిస్టిక్ మూవీని వైజయంతీ మూవీస్ పతాకంపై అశ్విని దత్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఇంకా నిర్మాణ దశలోనే ఉంది. తాజా సమాచారం ప్రకారం ఈ మెగా బడ్జెట్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ నెక్స్ట్ షెడ్యూల్ కోసం మేకర్స్ రంగం సిద్ధం చేస్తున్నారు.
Read Also : ఎట్టకేలకు ‘హరిహర వీరమల్లు’పై దృష్టి పెట్టిన పవన్
సినిమా తదుపరి షెడ్యూల్ ఫిబ్రవరి రెండవ వారంలో హైదరాబాద్‌లో ప్రారంభమై 10 రోజుల పాటు జరగనుంది. ప్రభాస్, దీపికా పదుకొణె లుఈ లాంగ్ షెడ్యూల్ లో పాల్గొననున్నారు. ఈ షెడ్యూల్‌లో పలు కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు మేకర్స్. ముఖ్యంగా ఈ కీలక షెడ్యూల్‌లో ప్రభాస్, దీపికా పదుకొణెలపై సీన్స్ చిత్రీకరిస్తారని సమాచారం. ఏప్రిల్ 2023లో విడుదల కానున్న ఈ హై-ఆన్ VFX చిత్రానికి మిక్కీ జె మేయర్ సంగీతం సమకూరుస్తుండగా, డాని శాంచెజ్-లోపెజ్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు.