Krithi Sanon : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వచ్చిన ఆదిపురుష్ హీరోయిన్ కృతిసనన్ కు ఇప్పుడు పెద్దగా అకవాశాలు రావట్లేదు. వాస్తవానికి ఈ బ్యూటీ స్పీడ్ చూసి పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ అవుతుందని అంతా అనుకున్నారు. కానీ ఏం లాభం.. పెద్దగా హిట్లు లేక డల్ అయిపోయింది. అయితే ఈ బ్యూటీ కూడా బాడీ షేమింగ్ ఎదుర్కుందంట. ఆ విషయాన్ని ఆమెనే స్వయంగా తెలిపింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ బ్యూటీ మాట్లాడుతూ.. తాను ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో కొందరు డైరెక్టర్లే కామెంట్లు చేసేవారంట.
Read Also : Kunickaa Sadanand : నలుగురితో డేటింగ్.. రోజూ మందు తాగుతా.. నటి షాకింగ్ కామెంట్స్
తన కాళ్లు కాస్త పొడుగ్గా ఉండటం చూసి.. ఒంటె కాళ్లలాగా ఉన్నాయి అంటూ కామెంట్ చేశారంట. అది విని తాను చాలా బాధపడినట్టు తెలిపింది. ఒకానొక టైమ్ లో తన మీద వస్తున్న కామెంట్లు చూసి ఇండస్ట్రీ వదిలి వెళ్లిపోదాం అనుకుందంట. కానీ అలాంటివి పట్టించుకుంటే లైఫ్ లో ముందుకు వెళ్లలేం అని తనను తాను ఓదార్చుకుని కష్టపడి సినిమా ఛాన్సులు పట్టేసినట్టు తెలిపింది ఈ బ్యూటీ. ఆమె చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఈమె తెలుగులో నాగచైతన్యతో దోచెయ్ మూవీ చేసింది.
Read Also : Chiranjeevi : వీసీ సజ్జనార్ ను కలిసిని మెగాస్టార్ చిరంజీవి
