Prabhas 120 Feet Cut Out Installed In The Heartland Of Mumbai City: హోంబలే ఫిల్మ్స్ ఫిలిమ్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ప్రభాస్ ‘సలార్ పార్ట్ 1: సీజ్ ఫైర్’ రిలీజ్ కి రెడీ అవుతోంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన ఈ సలార్ గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన పెద్ద 120 అడుగుల కటౌట్‌ను హార్ట్ ఆఫ్ ముంబైలో ఏర్పాటు చేశారు. ఓ సౌత్ ఇండియన్ సినిమాకు సంబంధించిన ఇంత పెద్ద కటౌట్‌ను ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి. ‘సలార్ పార్ట్ 1: సీజ్ ఫైర్’ కంటే ముందు, హోంబలే ఫిల్మ్స్ ‘కెజిఎఫ్ చాప్టర్ 2’ నగరంలో 100 అడుగుల కటౌట్‌ను ఏర్పాటు చేశారు. ఇక ‘సలార్ పార్ట్ 1: సీజ్ ఫైర్’ నిడివి 2 గంటల 55 నిమిషాలు, కాగా దీనికి సెన్సార్ బోర్డ్ A సర్టిఫికేట్ ఇచ్చింది. సినిమాలో చాలా రక్తపాత సన్నివేశాలు, హింస అలాగే యుద్ధ సన్నివేశాలు ఉన్నాయి. ఇక ప్రభాస్ ఇటీవల సినిమా కోసం తన మేకోవర్ గురించి మాట్లాడారు.
Bigg Boss 7 Telugu: గ్రాండ్ ఫినాలేకి మహేష్ బాబుని పిలిచారా? లేదా?
ఓ ఇంటర్వ్యూలో ‘సలార్’లో మీ పాత్రను షూట్ చేయడానికి తీసుకున్న సమయం గురించి అడిగితే ప్రభాస్ స్పందిస్తూ.. ‘ప్రశాంత్ హీరోస్ డైరెక్టర్, అందుకే ఆయన నన్ను చాలా కంఫర్టబుల్‌గా ఉంచారు. నేను, శృతి, పృథ్వీ లాంటి నటులు ఒక్కసారి సెట్‌పైకి వస్తే ఎవరూ ఆపలేరు, అందుకే కేవలం మా షాట్లపైనే దృష్టి పెట్టాడు. నేను సెట్‌లో వేచి ఉండాల్సిన అవసరం లేదు, వేచి ఉంటా అని వారికి చెప్పినప్పటికీ ప్రశాంత్ ముందే చేసేవాడని అన్నారు. ఫస్ట్ షెడ్యూల్ కి వచ్చేసరికి టైం ఎప్పుడో గుర్తు లేదు కానీ హీరో ఎంట్రీ స్టార్ట్ అయిందని, ఇక హీరో షాట్స్ మాత్రమే తీస్తాం అంటూ అంతా ఆపేశారని అన్నారు. ఇక ఈ సినిమాలో ప్రభాస్‌తో పాటు పృథ్వీరాజ్ సుకుమారన్, శ్రుతి హాసన్, జగపతి బాబు కూడా నటిస్తున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను విజయ్ కిరగందూర్ నిర్మించగా డిసెంబర్ 22, 2023న థియేటర్లలో విడుదల కానుంది.