ఆర్సీ 15 వర్కింగ్ టైటిల్‌తో మొదలైన రామ్ చరణ్, శంకర్ సినిమా టైటిల్ గురించి… రకరకాల కథనాలు వస్తున్నాయి. ఇప్పటికే కొన్ని షెడ్యూల్స్ షూటింగ్ కంప్టీట్ చేసుకున్న ఈ సినిమా.. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. అయితే ఈ ప్రాజెక్ట్ టైటిల్ అనౌన్స్మెంట్ గురించి గత కొద్ది రోజులుగా జోరుగా వినిపిస్తోంది. కానీ ఇప్పటి వరకు పుకార్లు తప్పితే.. శంకర్ టీమ్ నుంచి ఎలాంటి అఫిషీయల్ అప్టేట్ రాలేదు. కానీ చిత్ర వర్గాల సమచారం ప్రకారం.. అతి త్వరలోనే ఈ సినిమా టైటిల్, ఫస్ట్‌లుక్‌ను భారీ ఎత్తున విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే శంకర్.. టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్ డిజైన్ చేసి పెట్టాడని.. సరైన ముహూర్తం కోసం ఎదురు చూస్తున్నాడని వినిపిస్తోంది.
ఈ నేపథ్యంలో.. తాజాగా ఈ సినిమా టైటిల్ ఇదేనంటూ.. ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇంతకు ముందు సర్కారోడు అనే టైటిల్ వినిపించగా.. ఇప్పుడు ‘అధికారి’ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో.. చరణ్ డ్యూయెల్ రోల్‌లో నటిస్తున్నాడు. అందులో ఒకటి ఐఏఎస్ పాత్ర అని తెలుస్తోంది. దాంతో టైటిల్ చాలా పవర్ ఫుల్‌గా ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. అందుకే ‘అధికారి’ టైటిల్.. కథకు కరెక్ట్‌గా ఉంటుందని భావిస్తోందట శంకర్ అండ్ టీమ్. అయితే విషయంలో చిత్ర యూనిట్ నుండి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం.. అధికారిగా చరణ్ మరింత పవర్ ఫుల్‌గా ఎలివేట్ అవడం ఖాయమంటున్నారు. ఇక టైటిల్ లుక్‌ను ఇండిపెండెన్స్ డే సందర్భంగా.. శంకర్ మార్క్‌లోనే గ్రాండ్‌గా రిలీజ్ చేయాలని చూస్తున్నారట. ఈ సినిమా చరణ్ కెరీర్‌లో 15వ చిత్రంగా.. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు బ్యానర్లో 50 చిత్రంగా తెరకెక్కుతుండడంతో.. భారీ అంచనాలున్నాయి. పైగా శంకర్ ఈ సినిమాతో కమ్ అయ్యేందుకు కసిగా ఉన్నాడు. మరి ఈ సినిమా సర్కారోడుగా రాబోతోందా.. లేదా అధికారిగా వస్తుందా.. అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.