పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ గా చూపిస్తూ డైరెక్టర్ సుజిత్ చేస్తున్న సినిమా ‘OG’. పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తున్న ఈ మూవీ నుంచి టీజర్ బయటకి వచ్చి సోషల్ మీడియాని రూల్ చేస్తుంది. పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ అయిన ఈ టీజర్ ట్రెమండస్ రెస్పాన్స్ తెచ్చుకుంది. సుజిత్ స్టైలిష్ మేకింగ్, థమన్ థంపింగ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, అర్జున్ దాస్ ఇచ్చిన వాయిస్ ఓవర్, పవన్ కళ్యాణ్ టెర్రిఫిక్ స్క్రీన్ ప్రెజెన్స్ OG టీజర్ ని గూస్ బంప్స్ స్టఫ్ గా మార్చాయి. తెలుగులో ఈ మధ్య కాలంలో ఇలాంటి టీజర్ ని చూడలేదు. విక్రమ్, జైలర్ టీజర్ ట్రైలర్ లు చూసి షాక్ అయిన తెలుగు ఆడియన్స్ కి ఆ రేంజ్ ఇంపాక్ట్ ఇచ్చింది OG టీజర్.
పవన్ కళ్యాణ్ సినిమాలకి సంబంధించి నార్మల్ అప్డేట్ బయటికి వస్తేనే ఫ్యాన్స్ డిజిటల్ రికార్డ్స్ ని చెడుగుడు ఆడేస్తారు. అలాంటిది OG రేంజ్ టీజర్ వస్తే రికార్డ్స్ ని బ్రేక్ చేయడం కాదు ఏకంగా హిస్టరీ క్రియేట్ చేసారు. OG టీజర్ రిలీజ్ అయిన 24 గంటల్లో 16 మిలియన్ వ్యూస్, 730K లైక్స్ ని సొంతం చేసుకుంది. ఈరోజుతో వన్ మిలియన్ లైక్స్ ని OG టీజర్ సొంతం చేసుకోనుంది. తెలుగులో 24 గంటల్లో అత్యధిక లైక్స్ సాధించిన టీజర్ గా OG నిలిచింది. అనౌన్స్మెంట్ నుంచే హ్యూజ్ హైప్ ని మైంటైన్ చేస్తున్న OG సినిమాపై ఉన్న అంచనాలని టీజర్ మరింత పెంచింది. జస్ట్ టీజర్ కే ఇలా ఉంటే ట్రైలర్ ని ప్రతి ఒక్కరూ మెంటలెక్కి పోతారేమో.