ఒక సినిమా ప్రమోషన్స్ ని ఏ రేంజులో చెయ్యాలో, ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ నుంచే ఎక్స్పెక్టేషన్స్ ని ఎలా సెట్ చెయ్యాలో మొత్తం ఫిల్మ్ ఇండస్ట్రీకే నేర్పిస్తున్నారు ‘OG’ మేకర్స్. డీవీవీ దానయ్య ప్రొడక్షన్ లో సుజిత్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమా ‘OG’. ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ గా పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఈ మూవీ అఫీషియల్ గా అనౌన్స్ అయిన రోజు నుంచి బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ ఇస్తూనే ఉన్నారు. బజ్ జనరేట్ చెయ్యడం ఎలానో నేర్పిస్తున్న ‘OG’ చిత్ర యూనిట్ రీసెంట్ గా ఒకే ఒక్క వీడియోతో ఎవరూ ఊహించని అంచనాలను పెంచేశారు. పవన్ కళ్యాణ్‌ని సింగిల్ ఫ్రేమ్‌లో కూడా చూపించకుండా, స్క్రిప్ట్ రైటింగ్ షాట్స్ తోనే రెడీ చేసిన ఈ వీడియో ‘OG’ సినిమాకి హ్యూజ్ హైప్ ని తెచ్చి పెట్టింది. సుజిత్ బేసిక్ గానే పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కాబట్టి అతను పవన్ ని ఏ రేంజులో చూపిస్తాడు అనే ఆలోచనలో ఫాన్స్ అంతా ఎవరికి వాళ్లు లెక్కలు వేసుకుంటూ ఉన్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కి ఫ్యాన్ అయిన హరీష్ శంకర్ బాక్సాఫీస్ ని షేక్ చేసిన హిస్టరీ, ఫాన్స్ దగ్గర సాక్ష్యంగా ఉంది.
ఇప్పటికే ముంబైలో ఓజి షూటింగ్ షూటింగ్ స్టార్ట్ అయింది, పవన్ కళ్యాణ్ లేకుండానే రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేశాడు సుజిత్. ముంబైలో జరుగుతున్న షూటింగ్ లో పవన్ కళ్యాణ్ ‘OG’ షూటింగ్ లో జాయిన్ అయ్యాడు. ఈ విషయాన్ని రివీల్ చేస్తూ మేకర్స్ నుంచి స్పెషల్ అప్డేట్ బయటకి వచ్చింది. #OG HAS ARRIVED on sets… అంటూ డీవీవీ ఎంటర్టైన్మెంట్ నుంచి ట్వీట్ వచ్చింది. ఇందులో పవన్ కళ్యాణ్, తన ట్రేడ్ మార్క్ బ్లాక్ హుడి వేసుకోని స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. లైట్ బియర్డ్ తో, గాగుల్స్ పెట్టుకోని పవన్ కళ్యాణ్ పంజా సినిమా వైబ్స్ ని ఇస్తున్నాడు. వేట మొదలు పెట్టడానికి వస్తున్న ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ లా ఉన్నాడు పవన్ కళ్యాణ్. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ ఇస్తున్న మేకర్స్ సాలిడ్ బజ్ ని జనరేట్ చెయ్యడంలో సక్సస్ అవుతున్నారు, ఇదే జోష్ ని సినిమా రిలీజ్ అయ్యే వరకూ మైంటైన్ చేస్తే ‘OG’ సినిమా టాలీవుడ్స్ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచే ఛాన్స్ ఉంది.
THE #OG HAS ARRIVED on sets… 🔥🔥🔥#PawanKalyan #TheyCallHimOG #FireStormIsComing@PawanKalyan @sujeethsign @dop007 @MusicThaman #ASPrakash @DVVMovies #FireStormIsComing 🔥#𝙏𝙝𝙚𝙮𝘾𝙖𝙡𝙡𝙃𝙞𝙢𝙊𝙂💥 pic.twitter.com/Qv9K9ito4Q
— DVV Entertainment (@DVVMovies) April 18, 2023
The #OG Team on sets… 🔥❤️ #PawanKalyan #TheyCallHimOG #FireStormIsComing@PawanKalyan @sujeethsign @dop007 @MusicThaman #ASPrakash @DVVMovies #FireStormIsComing 🔥#TheyCallHimOG 💥 pic.twitter.com/9otSbUQygJ
— DVV Entertainment (@DVVMovies) April 18, 2023