తెలుగు సినిమా పుట్టినప్పటి నుంచి ఎందరో ఆర్టిస్టులు ఎన్నో రకాల పాత్రలు చేసి ఉంటారు. ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తూ రాకరకాల పాత్రలని తెరపై పుడుతూనే ఉంటాయి. ఎవరు ఎలాంటి పాత్ర చేసినా ‘దేవుడు’ అనే పాత్ర మాత్రం ఒక్క నందమూరి తారక రామారావుకే చెల్లింది. తెలుగు ప్రజల చేత అన్నగారు అని పిలిపించుకున్న ఎన్టీఆర్, తెరపై కృష్ణుడు, రాముడు, శివుడు, వెంకటేశ్వర స్వామీ, పోతులూరి వీర బ్రహ్మేంద్రస్వామీ ఇలా ఎన్నో రకాల పాత్రలు వేశారు. తెలుగు మైథాలజీ ఉన్న అన్ని గొప్ప క్యారెక్టర్స్ ని తెలుగు తెరపై కళ్లకి కట్టినట్లు చూపించాడు ఎన్టీఆర్. అందుకే సినిమాల్లో దేవుడు అనగానే అందరికీ ఎన్టీఆర్ గుర్తొస్తాడు. తెలుగు సినిమాకి మరో మూలస్థంభం అయిన అక్కినేని నాగేశ్వరరావు ఎక్కువగా ‘భక్తుడి’ పాత్రలు పోషించాడు. ఎన్టీఆర్ దేవుడి పాత్రలు ఎలా పోషించాడో, బాలయ్య కూడా అలానే తండ్రిని ఫాలో అవుతూ కృష్ణావతారం, రామావతారం వేసాడు. ఏఎన్నార్ ని ఫాలో అవుతూ నాగార్జున కూడా భక్తుడి క్యారెక్టర్స్ ప్లే చేసాడు. అన్నమయ్య, శ్రీరామదాసు ఈ కోవలోకి వచ్చే సినిమాలే. నాగార్జున, ‘సాయిబాబా’ పాత్రలో కనిపించాడు కానీ అన్నమయ్య, రామదాసు స్థాయిలో ఆడియన్స్ ఆ సినిమాని ఆదరించలేదు. మెగాస్టార్ చిరంజీవి కూడా ‘మహా శివుడి’ అవతారం ఎత్తాడు. అయితే ప్రస్తుతం ట్రెండ్ మారింది భక్తి రస చిత్రాలు రావట్లేదు.
మారిన ట్రెండ్ కి తగ్గట్లు తెలుగు సినిమాపై కొత్త దేవుడు పుట్టొకొచ్చాడు, అతని పేరు పవన్ కళ్యాణ్. ఈ జనరేషన్ సినిమాల్లో కనిపిస్తున్న మోడ్రన్ గాడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రమే. ప్రస్తుతం ఉన్న టాలీవుడ్ స్టార్ హీరోల్లో పవన్ మాత్రమే దేవుడిగా రెండు సార్లు నటించాడు. గతంలో గోపాల గోపాల సినిమాలో దేవుడిగా దర్శనమిచ్చని పవన్.. ఇప్పుడు మరో సినిమాలో స్టైలిష్ గాడ్‌గా కనిపించబోతున్నాడు. తాజాగా పవన్ కళ్యాణ్, సాయి తేజ్ సినిమాకు ‘బ్రో’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ కూడా విడుదల చేశారు. ఈ పోస్టర్ లో పవన్ కళ్యాణ్ చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ‘బ్రో’ పోస్టర్ వైరల్ అవుతోంది. మరి రెండో సారి మోడరన్ దేవుడిగా కనిపించనున్న పవన్ కళ్యాణ్ ఎలాంటి రిజల్ట్ ని ఫేస్ చేస్తాడో చూడాలి.