Poonam Kaur Comments on Guru: ఒకప్పుడు సోషల్ మీడియా లేని రోజుల్లో ఎలా ఉండేదో కానీ ఇప్పుడు సోషల్ మీడియా అందుబాటులో ఉండటంతో సెలబ్రెటీలు ఏ విషయాలు పంచుకున్నా వెంటనే వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా నటి పూనమ్ కౌర్ ఒక స్టోరీ తన ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేయగా ప్రస్తుతం అది వైరల్ అవుతుంది. సినిమాలకు దూరంగా ఉంటూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతూ ఉంటుంది. ఈరోజు గురుపూర్ణిమ సందర్భంగా ఆమె ఒక స్టోరీ షేర్ చేసుకుంది.
Mouni Roy Photos: ఉల్లిపొర లాంటి గ్రీన్ శారీలో జిగేల్‌మనిపిస్తున్న మౌని రాయ్
ఇక ఆ స్టోరీలో ‘’ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేస్తున్నాను, టామ్, డిక్ అండ్ హారీ అని ప్రతి ఒక్కరినీ గురువు అని పిలవద్దని, నీతులు చెప్పి స్టేజ్ మీద జీవితాలతో ఆడుకునే వాడు గురువు కాదు, మీకు దారి చూపించేవారు గురువు అవుతారు అని ఆమె రాసుకొచ్చింది. ఆమె ఎవరి గురించి ఈ స్టొరీ షేర్ చేసిందో కానీ ఈ స్టోరీ మీద రకరకాల చర్చలు అయితే జరుగుతున్నాయి. ఇక పూనమ్ కౌర్ తెలుగు ప్రేక్షకులందరికీ పరిచయమే. అందగత్తె, మంచి నటి అయినా సరే ఆమె ఎందుకో అంత సక్సెస్ అందుకోలేకపోయింది. అయితే నటిగా నిరూపించుకో లేకపోయినా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ నిత్యం ఏదో ఒక విషయం మీద స్పందిస్తూ ఉంటుంది.