Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Movie News Poola Rangadu Completes 55 Years

Poola Rangadu: యాభై ఐదేళ్ళ ‘పూలరంగడు’

Published Date :November 24, 2022 , 6:35 am
By Prasanna Pradeep
Poola Rangadu: యాభై ఐదేళ్ళ ‘పూలరంగడు’
  • Follow Us :
  • google news
  • dailyhunt

Poola Rangadu Completes 55 Years: నటసమ్రాట్ అక్కినేని నాగేశ్వరరావును స్టార్ గా మలచడంలో ఆయన గురుతుల్యులు దుక్కిపాటి మధుసూదనరావు పాత్ర ఎంతో ఉంది. ఏయన్నార్ తో వైవిధ్యమైన పాత్రలు పోషింప చేయడానికే అన్నట్టు దుక్కిపాటి ‘అన్నపూర్ణ పిక్చర్స్’ సంస్థను నెలకొల్పి, దానికి అక్కినేనినే ఛైర్మన్ గా నియమించారు. తొలి చిత్రం ‘దొంగరాముడు’ మొదలు ఏయన్నార్ తో అనేక వైవిధ్యమైన సినిమాలు నిర్మించి, ఆయనను జనానికి మరింత చేరువ చేశారు దుక్కిపాటి. ఏయన్నార్ కు పలు సూపర్ హిట్ మూవీస్ అందించారు. 1960ల ద్వితీయార్ధం ఆరంభంలో ఏయన్నార్ వరుస పరాజయాలు చూస్తున్న సమయంలో ఆయనకు మళ్ళీ హిట్ ను అందించిందీ అన్నపూర్ణ సంస్థనే! ఎంతటి స్టార్ కైనా జయాపజయాలు తప్పవు. అలా ఏయన్నార్ నూ వరుసగా ఫ్లాపులు పలకరించాయి. ఈ నేపథ్యంలో అన్నపూర్ణ సంస్థ అక్కినేనితో తెరకెక్కించిన ‘పూలరంగడు’ మంచి విజయం సాధించింది. 1967 నవంబర్ 24న ఈ చిత్రం విడుదలై విజయఢంకా మోగించింది.

జట్కా నడుపుతూ జీవనం సాగిస్తున్న రంగయ్యను అందరూ ‘పూలరంగడు’ అంటూ ఉంటారు. గడ్డిమోపు అమ్మే వెంకటలక్ష్మికి రంగడు అంటే ఎంతో ఇష్టం. రంగడికి ఓ చెల్లెలు పద్మ అంటే ప్రాణం. ఇక వెంకటలక్ష్మికి ఓ తమ్ముడు నరసింహులు. అతనికి పద్మ అంటే ప్రేమ. కానీ, తన చెల్లెలికి పెద్దింటి సంబంధం రావాలని రంగడు ఆశిస్తూ ఉంటాడు. నిజంగా డాక్టర్ ప్రసాద్ ఆమెను ప్రేమించి పెళ్ళి చేసుకుంటాడు. ఆ సమయంలో నరసింహులు ఊళ్ళో ఉండడు. అతను తనకు దక్కని పద్మ వేరే వారి ఇంటికోడలు అయినందుకు ద్వేషం పెంచుకుంటాడు. వెళ్ళి ప్రసాద్ తల్లికి, పద్మ తండ్రి హత్య చేసి జైలులో ఉన్నాడని చెబుతాడు. ఆరా తీయగా, అతను హత్య చేసింది తన భర్తనే అని ఆమె తెలుసుకుంటుంది. అప్పటి నుంచీ పద్మకు కష్టాలు మొదలవుతాయి. తరువాత పద్మ పుట్టింటికి వస్తుంది. ఆ తరువాత ఆమె సామాను కూడా పంపిస్తారు. రంగడు చెల్లెలి కాపురం ఇలా చేసిన నరసింహులును చంపేయాలనుకుంటాడు. కానీ, వెంకటలక్ష్మి వచ్చి అడ్డుకొని, చేతనైతే అన్యాయం చేసిన మీ బావనే నిలదీసి అడగమని అంటుంది. దాంతో రంగడు చెల్లిని తీసుకొని బావ దగ్గరకు వెళ్ళాలనుకుంటాడు.

అప్పుడే అప్పులవాడు వచ్చి, తన అప్పు తీర్చమని బలవంత పెడతాడు. ఆలోగా పోలీసులు వచ్చి, నరసింహులును కొట్టినందుకు రంగడిని అరెస్ట్ చేస్తారు. కోర్టు అతనికి శిక్ష విధిస్తుంది. అదే జైలులో ఉన్న తన తండ్రి వీరయ్యను కలుసుకుంటాడు రంగడు. అసలు విషయం తెలుస్తుంది. ధర్మారావు, చలపతి అనేవాళ్ళు గతంలో పురుషోత్తం అనే వ్యక్తిని చంపి, డబ్బు దోచుకొని ఆ నేరం వీరయ్యపై వేసి ఉంటారు. తరువాత ధర్మారావు ధనవంతుడై ఆ ఊరిలో పెద్దమనిషిగా చెలామణీ అవుతూ ఉంటాడు. ఈ విషయం తెలుసుకున్న రంగడు విడుదలయ్యాక బయటకు వచ్చి, ఓ పథకం ప్రకారం ధర్మారావు ఇంట నౌకరుగా చేరతాడు. ఓ నాటకం ఆడి, ధర్మారవు, చలపతి ద్వారానే అసలు విషయాలు బయట పెట్టిస్తాడు. అందుకు చలపతి కొడుకు బుజ్జినీ వాడుకుంటారు. ధర్మారావు, చలపతి మాటలను రికార్డు చేస్తారు. ఆ క్యాసెట్ కోసం పలు తంటాలు పడతారు ధర్మారావు, చలపతి. చివరకు ఆ క్యాసెట్ ను కోర్టులో జడ్జి ముందు పెడతారు. ధర్మారావు తన నేరాన్ని అంగీకరిస్తాడు. అసలు విషయం తెలుసుకున్న డాక్టర్ ప్రసాద్ తన భార్య పద్మను ఆదరిస్తాడు. వీరయ్య విడుదలవుతాడు. రంగడు, వెంకటలక్ష్మి పెళ్ళితో పాటే బుజ్జి, ధర్మారావు కూతురు లిల్లీ కూడా పెళ్ళిచేసుకోవడంతో కథ ముగుస్తుంది.

ఇందులో ఏయన్నార్ జోడీగా జమున నటించగా, శోభన్ బాబు, విజయనిర్మల, గుమ్మడి, సూర్యకాంతం, పద్మనాభం, గీతాంజలి, నాగయ్య, చలం, భానుప్రకాశ్, మాలతి, అల్లు రామలింగయ్య, రాధాకుమారి, బేబీ వరలక్ష్మి ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి ముళ్ళపూడి వెంకటరమణ కథ సమకూర్చగా, నిర్మాత మధుసూదనరావు సినిమా అనుకరణ రూపొందించారు. ప్రముఖ రచయిత్రి ముప్పాళ రంగనాయకమ్మ మాటలు రాశారు. కొసరాజు, సి.నారాయణ రెడ్డి, దాశరథి రాసిన పాటలకు యస్.రాజేశ్వరరావు సంగీతం సమకూర్చారు.

ఈ చిత్రానికి ఎ.జె.క్రోనిన్ రాసిన ‘బియాండ్ దిస్ ప్లేస్’ నవల స్ఫూర్తి. కాగా, ఇందులోని “నీతికి నిలబడి నిజాయితీగా…”, “నీ జిలుగు పైట నీడలోన…”, “చిగురులు వేసిన కలలన్నీ…”, “నీవు రావు నిదుర రాదు…”, “చిల్లర రాళ్ళకు మొక్కుతు ఉంటే…”, “మిసమిసలాడే చినదానా…”, “సిగ్గెందుకే పిల్లా…”, “ఎయ్ రా సిన్నోడెయ్ రా…” అంటూ సాగే పాటలు భలేగా ఆకట్టుకున్నాయి. ‘పూలరంగడు’ బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించి, 11 కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకుంది. ఈ చిత్రాన్ని తరువాత తమిళంలో యమ్జీఆర్ హీరోగా ‘ఎన్ అన్నన్’ పేరుతో పా.నీలకందన్ రీమేక్ చేశారు. హిందీలో రణధీర్ కపూర్, బబిత జంటగా ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలోనే బాబూ మూవీస్ పతాకంపై ‘జీత్’ గానూ పునర్నిర్మించారు.

ఈ చిత్రంలోని జైలు సన్నివేశాలను సహజత్వం కోసం చంచల్ గూడ, ముషీరాబాద్ జైళ్ళలో చిత్రీకరించారు. ఇందులోని “చిల్లర రాళ్ళకు మొక్కుతు ఉంటే…” పాటను వాటిలోనే తెరకెక్కించారు. ఈ సినిమాకు కథ అందించిన ముళ్ళపూడి వెంకటరమణ మాటలు కూడా రాశారు. కానీ, వేరే వర్షన్ ను ముప్పాళ రంగనాయకమ్మతో రాయించారు దుక్కిపాటి. ఈ విషయం ముళ్ళపూడికి తెలియజేయలేదు. సినిమా టైటిల్ కార్డ్స్ లో తన పేరు కథకుడిగా మాత్రమే చూసిన ముళ్ళపూడి మనస్తాపం చెందారు. ఆ తరువాత దుక్కిపాటి చిత్రాలకు పనిచేయకూడదని ఆయన నిర్ణయించారు. దుక్కిపాటి పలు అవకాశాలు కల్పించినా, సున్నితంగా తిరస్కరించారు. 1982లో తన మిత్రుడు బాపు దర్శకత్వంలో దుక్కిపాటి ‘పెళ్ళీడు పిల్లలు’ చిత్రం నిర్మించినప్పుడు మాత్రం ఆ సినిమాకు రచన చేశారు ముళ్ళపూడి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Akkineni Nageswara Rao
  • Jamuna
  • Poola Rangadu
  • Sobhan babu
  • Vijaya Nirmala

తాజావార్తలు

  • Nethi Bobbatlu Recipe: పప్పు నానబెట్టే పని లేకుండా ఇన్స్టంట్ ‘నేతి బొబ్బట్లు’.. ఇలా చేస్తే దూదిలా మెత్తగా ఉంటాయంతే.!

  • Fuel Update : 40 దేశాల నుంచి భారత్ కు క్రూడాయిల్ వస్తోంది..!

  • Revanth Reddy: నేను కృష్ణ అభిమానిని.. లారీ ఎక్కి వెళ్లి సినిమాలు చూసే వాడిని!

  • CEC Gyanesh Kumar: CEC జ్ఞానేష్ కుమార్ తొలగింపుకు నోటీసులు.. 193 మంది ఎంపీల సంతకాలు..

  • IPL 2026: RCBకి బిగ్ షాక్.. కీలక ప్లేయర్ దూరం..!

ట్రెండింగ్‌

  • Subramaniya Bharathi: రోజూ కూలీ కుమారుడు.. తొలి ప్రయత్నంలోనే UPSC క్లియర్.. ఇన్‌స్పైర్ స్టోరీ..!

  • ప్రైవసీ కోసం కొత్త సేవ.. మహిళలకు BSNL ‘Kavach Number’ ప్రారంభం..!

  • టీ20 ప్రపంచకప్ విజయం ప్రేరణగా ‘Ola Champions Edition’ కొత్త ఎలక్ట్రిక్ వాహనాలు.. ఫీచర్స్ ఇలా.!

  • LIC New Children Money Back Plan: రోజుకు రూ.150 పెట్టుబడి అంతే.. రూ.19 లక్షలు మీసొంతం.!

  • 120Hz LCD డిస్‌ప్లే, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో iQOO Z11x 5G లాంచ్.. ధర ఎంతంటే?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions