Pooja Hegde : పూజాహెగ్దే ప్రస్తుతం బాలీవుడ్ కే పరిమితం అయిపోయింది. తెలుగులో దాదాపు సినిమాలు మానేసింది. అక్కడే సినిమాలు చేసుకుంటూ బిజీగా ఉంటుంది. ఈ క్రమంలోనే ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇందులో ఇండస్ట్రీలో ఎదుర్కున్న సమస్యలపై ఆమెకు ప్రశ్న ఎదరైంది. దానిపై స్పందిస్తూ.. సినిమా ఇండస్ట్రీలో అందరికీ ఒకే రకమైన సమస్యలు ఎదురుకావని తెలిపింది. ఎవరి పరిస్థితులను బట్టి వారికి అది ఇబ్బందిగా అనిపిస్తుందని.. కొందరికి అది సమస్యగా అనిపించదు అంటూ తెలిపింది. ఇక హీరోయిన్లపై వివక్ష అనే దానిపై కూడా స్పందించింది.
Read Also : Tamannaah : కోపం వస్తే తెలుగులోనే తిడుతాను.. తమన్నా షాకింగ్ కామెంట్స్
‘సినిమా ఇండస్ట్రీలో కొన్ని సార్లు ఇబ్బందులు తప్పవు. హీరోల కారవాన్లు సెట్స్ కు పక్కనే ఉంచుతారు. కానీ మాకు మాత్రం దూరంగానే ఉంటాయి. మిగతా అందరికీ దూరంగానే ఉంచుతారు. మేం బరువైన డ్రెస్సులు, లెహంగాలు వేసుకుని అంత దూరం నడుచుకుంటూ వెళ్లాల్సింది. ఏ అవసరం వచ్చినా సరే నడుచుకుంటూ వెళ్లి రావాలి. అప్పుడప్పుడు ఇబ్బందిగా ఉంటుంది. ఒక రకంగా ఇది ఒక రకమైన వివక్ష’ అటూ సంచలన కామెంట్లు చేసింది. ఆమె చేసిన కామెంట్లు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. గతంలో కూడా ఆమె ఇలాంటి కామెంట్స్ చేసి అందరి దృష్టిలో పడింది.