కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న చిత్రం పొన్నియన్ సెల్వన్. విక్రమ్, జయం రవి, కార్తీ, త్రిష, ఐశ్వర్య రాయ్, విక్రమ్ ప్రభు, ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని మద్రాస్ టాకీస్ తో కలిసి లైకా ప్రొడక్షన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా రిలీజైన టీజర్ సినిమాపై భారీ అంచనాలను రేకెత్తించాయి. ఇక ఈ టీజర్ ఈవెంట్ ను చెన్నైలో గ్రాండ్ గా నిర్వహించారు. సినిమాలోని ప్రధాన తారాగణం అంతా సాంప్రదాయమైన దుస్తుల్లో కనిపించే ప్రేక్షకులను ఫిదా చేశారు. అయితే ఈ టీజర్ ఈవెంట్ లో విక్రమ్ లేని లోటు కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.
విక్రమ్ ఈరోజు అనారోగ్యంతో ఆసుపత్రి పాలైన విషయం తెల్సిందే. అన్ని బాగా జరిగితే విక్రమ్ కూడా ఈ వేదికపై కనిపించేవాడు. ఆయన అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉండడం వలన ఈ వేడుకకు హాజరుకాలేకపోయాడు. దీంతో విక్రమ్ అభిమానులు కోడిగా నిరాశ చెందుతున్నారు. ఇక సినిమా గురించి చిత్ర బృందం మాట్లాడుతూ.. ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను లైకా నిర్మించిందని, మణిరత్నం కల ఈ సినిమా అని, కోలీవుడ్ లోనే ఒక పెద్ద భారీ మల్టీస్టారర్ గా తెరకెక్కుతోందని చెప్పుకొచ్చారు. ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని, అన్ని భాషల్లో ప్రేక్షకులను అలరిస్తుందని తెలిపారు. ఇక ఈ సినిమా మొదటి పార్ట్ సెప్టెంబర్ 30 న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ చిత్రం ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.