PM Modi: కాంతార, కెజిఎఫ్ హీరోలతో ప్రధాని.. ఫోటో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేడు బెంగుళూరులో సందడి చేశారు. యెలహంకలోని ఎయిర్ స్టేషన్‌లో ఏరో ఇండియా షోను ప్రారంభించేందుకు ప్రధాని బెంగళూరు విచ్చేసిన ఆయనకు కన్నడిగులు ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో
ప్రధాని మోదీతో పాటు దివంగత నటుడు పునీత్ రాజ్‌కుమార్ భార్య అశ్విని రాజ్‌కుమార్ సైతం పాల్గొన్నారు. ఇక ఇదే కార్యక్రమంలో కన్నడ స్టార్ నటులు యష్, రిషబ్ శెట్టి పాల్గొని ప్రధానిని మీట్ అయ్యారు. వారితో ప్రధాని కొద్దిసేపు ముచ్చటించారు. కన్నడ సినిమా, కర్నాటక సంస్కృతి వంటి పలు అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం. సాంస్కృతిక గుర్తింపును పెంపొందించడం మరియు సినిమాల్లో మహిళా పాత్రలకు ప్రాధాన్యత ఇవ్వడం కోసం దక్షిణాది సినిమా ప్రయత్నాలు చేస్తుండడం మంచి విషయమని ఆయన ప్రశంసించారని తెలుస్తోంది. ఇక ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి.
Shakuntalam: ఈ పోస్టర్ చాలా హాట్ గురూ…
Also Read
ఇకపోతే గతేడాది కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన రెండు సినిమాలు భారీ విజయాన్ని అందుకున్న విషయం తెల్సిందే. యష్.. కెజిఎఫ్ 2 మరోసారి ప్రపంచాన్ని గడగడలాడించగా, రిషబ్.. కాంతారతో అన్ని ఇండస్ట్రీలలో హిట్ ను కొట్టేశాడు. ఒకప్పుడు కన్నడ సినిమాలు అంటే ఎవరికి నచ్చేవి కాదు. అందుకే కన్నడవారు తమ సినిమాలను వేరే భాషలో రిలీజ్ చేయాలంటే భయపడేవారు. కానీ ఈ రెండు సినిమాలు కన్నడ ఇండస్ట్రీ చరిత్రను తిరగరాశాయనే చెప్పాలి. ఇంకా ముందు ముందు మంచి సినిమాలను రిలీజ్ చేయడానికి కన్నడ ఇండస్ట్రీ మంచి ప్రయత్నాలు చేస్తుంది. ప్రస్తుతం రిషబ్.. కాంతార 2 సినిమా తెరకెక్కించే పనుల్లో ఉండగా.. యష్ తన తదుపరి సినిమాను త్వరలోనే ప్రకటించనున్నాడు. మరి ఈ సినిమాలతో కన్నడ ఇండస్ట్రీ ఇంకెలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
Russia Oil: ‘‘రష్యా చమురు కొనొద్దు’’.. భారత్, చైనాలకు ట్రంప్ టీమ్ వార్నింగ్..
-
Jeevanlal Lavidiya : మాజీ ఐటీ కమిషనర్‌కు మరో షాక్.. భార్యపైనా కేసు.!
-
BRICS Summit: బ్రిక్స్ తర్వాత ప్రపంచ నాయకులకు అస్వస్థత అంటూ తప్పుడు ప్రచారం.. తీవ్రంగా ఖండించిన భారత్
-
Sarah Shahi: బెడ్రూమ్ సీన్లలో హీరోల స్పర్శ తగలకుండా ఆ బాల్తోనే.. బోల్డ్ సీన్స్ అసలు గుట్టు విప్పిన హీరోయిన్!
-
Dharmana Krishnadasu: వర్షాలు లేక సాగు ఆలస్యం.. ఎరువులు లేక రైతుల అవస్థలు.. ధర్మాన కృష్ణదాసు ఆవేదన..
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!