సౌత్ హీరోలు నార్త్‌లో సిసినిమాలు చేయాలనుకోవం కామన్. కానీ నౌ జస్ట్ ఫర్ ఛేంజ్ ముంబయి స్టార్ హీరోలు దక్షిణాది చిత్రాల్లో వర్క్ చేసేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. సల్మాన్, అమితాబ్, సైఫ్, అక్షయ్, అజయ్ దేవగన్ స్టార్స్ టాలీవుడ్ తెరంగేట్రం జరిపోయింది. కానీ వీరంతా వివిధ స్టార్స్‌తో వర్క్ చేశారు. కానీ కేవలం ఒక్క రజనీకాంత్ కోసం నార్త్ స్టార్ హీరోలు క్యూ కట్టడమంటే మామూలు విషయం కాదు. ఒకప్పుడు బాలీవుడ్లో సౌత్ హీరోలు పెద్దగా క్లిక్ అవ్వని టైంలో తన మార్క్ క్రియేట్ చేసి తనకంటూ ఓన్ మార్కెట్ ఏర్పాటు చేసుకున్నారు రజనీ. ప్రజెంట్ కోలీవుడ్ డబ్బింగ్ చిత్రాలతోనే హిందీ ఆడియన్స్‌ను పలకరిస్తున్నారు.
Also Read : OSSS : మలయాళ హిట్ సినిమా తెలుగు రీమేక్ ‘ఓం శాంతి శాంతి శాంతిః
రజనీ.. ఇప్పుడు బీటౌన్ స్టార్ హీరోలకు కోలీవుడ్‌లో ఐడెండిటీని క్రియేట్ చేస్తున్నాడు. వెట్టయాన్‌తో తొలిసారిగా తమిళ తంబీలను పలకరించాడు బిగ్ బి. 33 ఏళ్ల తర్వాత లెజెండరీ యాక్టర్లు తెరపై కనిపించారు. బొమ్మ బ్లాక్ బస్టర్ అయ్యింటే ఈ ఆనందం డబుల్ ఉండేది. కానీ ప్లాప్ వల్ల బిగ్ బి కనిపించినా.. ఉపయోగం లేకుండా పోయింది. ఇప్పటి వరకు సౌత్ మొహమే చూడని అమీర్ ఖాన్ రజనీకాంత్ మూవీతోనే కోలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో వస్తోన్న కూలీలో ఓ స్పెషల్ రోల్ చేయబోతున్నాడు. దహ అనే క్యారెక్టర్ చేస్తున్నట్లు రీసెంట్లీ పోస్టర్ పంచుకుంది యూనిట్. సుమారు 15 నిముషాలు కనిపించబోతున్నాడని టాక్. 1995లో వచ్చిన ఆటంక్ హి ఆటంక్ తర్వాత అంటే 30 ఇయర్స్ తర్వాత ఈ ఇద్దరు స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. ఈ ఇద్దరే కాదు షారూఖ్ ఖాన్ ను కూడా రజనీ కోసం పట్టుకు రాబోతున్నాడట నెల్సన్ దిలీప్ కుమార్. జైలర్ 2లో క్యామియో రోల్ కోసం అప్రోచ్ అయ్యారని తెలుస్తోంది.