యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘సలార్’. ఇందులో ప్రభాస్ కు జోడిగా శృతి హాసన్ నటిస్తోంది. ఈ చిత్రాన్ని తెలుగు, కన్నడ భాషల్లో ఏకకాలంలో చిత్రీకరించి హిందీ, తమిళం, మలయాళ భాషల్లోకి డబ్ చేయనున్నారు. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రవి బస్రూర్ సంగీతం సమకూర్చారు. అండర్ వరల్డ్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రం ఏప్రిల్ 14న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన తాజా బజ్ రెబల్ స్టార్ అభిమానులను థ్రిల్ చేస్తోంది.
Read Also : కాస్ట్లీ బైకులపై మనసు పారేసుకుంటున్న బిగ్ బాస్ భామలు
ఇంతకీ ఆ బజ్ ఏమిటంటే… ‘సలార్’ రెండు భాగాలుగా రాబోతోందట. దీనికి సంబంధించిన అఫిషియల్ అనౌన్స్మెంట్ త్వరలో రాబోతోందని, ఇంతకుముందు ‘బాహుబలి’ లాగే హిస్టరీ రిపీట్ అవుతుందని అంటున్నారు. అభిమానుల వరుస ట్వీట్లతో ఇప్పుడు ప్రభాస్, సలార్ ట్రెండింగ్ లో ఉన్నాయి. మరి ఈ వార్త గురించి మేకర్స్ ఏమంటారో చూడాలి. కాగా ‘సలార్’లో భావోద్వేగాలతో కూడిన హై-వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయి. మిలిటరీ ట్యాంకులు, జీప్‌లు, రైఫిల్స్, మెషిన్ గన్‌లు, విమానాలను కొన్ని యాక్షన్ సీక్వెన్స్‌లలో ఉపయోగిస్తున్నారట. క్లైమాక్స్ సీన్ కోసం దాదాపు 80+ కోట్లు ఖర్చు చేస్తున్నారని టాక్.