Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Phalana Abbayi Phalana Ammayi First Look Launched

Phalana Abbayi Phalana Ammayi: దశాబ్దపు ప్రేమ ప్రయాణం!

Published Date :January 2, 2023 , 4:30 pm
By Omprakash Vaddi
Phalana Abbayi Phalana Ammayi: దశాబ్దపు ప్రేమ ప్రయాణం!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Naga Shaurya: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, దాసరి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఫీల్ గుడ్ రొమాంటిక్ ఫిల్మ్ ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’. దీనికి శ్రీనివాస్ అవసరాల దర్శకత్వం వహిస్తున్నారు. ‘కళ్యాణ వైభోగమే’ చిత్రంతో వెండితెరపై మ్యాజిక్‌ చేసిన హిట్ పెయిర్ నాగశౌర్య, మాళవిక నాయర్ ఈ చిత్రంలో హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ 2022లో ‘ధమాకా’, ‘కార్తికేయ 2’ చిత్రాలతో మరో రెండు భారీ విజయాలను అందుకుంది. ఇదిలా ఉంటే… నటుడు నాగశౌర్య, దర్శకుడు శ్రీనివాస్ అవసరాల కలిసి గతంలో ‘ఊహలు గుసగుసలాడే’, ‘జ్యో అచ్యుతానంద’ అనే చిత్రాలు చేశారు. ఈ రెండు చిత్రాలూ వారిలోని ఉత్తమ ప్రతిభను బయటకు తీసుకొచ్చాయి. థియేటర్లలో ఎంతగానో ఆకట్టుకున్న ఈ చిత్రాలు.. టీవీ, ఓటీటీ లలో ఇప్పటికీ గొప్ప ఆదరణ పొందుతున్నాయి. ఇప్పుడు ‘ఫలానా అబ్బాయి – ఫలానా అబ్బాయి’తో నాగశౌర్య-శ్రీనివాస్ అవసరాల హ్యాట్రిక్ విజయాన్ని అందుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఈ మూవీ ఫస్ట్‌లుక్‌ను సోమవారం విడుదల చేశారు. నాగ శౌర్య, మాళవిక నాయర్ ఇద్దరూ ఫార్మల్ వింటర్‌వేర్ ధరించి, ప్రయాణంలో ఒకరిపై ఒకరు వాలిపోయి సంగీతం వింటూ కనిపించారు. పోస్టర్ లో అందమైన వస్త్రధారణతో, అంతకంటే అందంగా ఉన్న ఆ జంటను చూస్తుంటే.. ఈ ఫీల్ గుడ్ ఫిల్మ్ ఎప్పుడెప్పుడా చూస్తామా అనే ఆసక్తి కలగక మానదు.

ఆదివారం విడుదల చేసిన ఈ మూవీ ఫస్ట్ లుక్ అనౌన్స్‌మెంట్ వీడియోకి కూడా మంచి స్పందన లభించింది. ఆ వీడియోలో శ్రీనివాస్ అవసరాలతో కాల్ మాట్లాడిన హీరోహీరోయిన్లు సినిమా గురించి ఎటువంటి అప్‌డేట్‌లు లేకపోవడంపై చర్చించారు. “ఆర్ఆర్ఆర్ కూడా విడుదలైంది” అని శౌర్య అనగా.. “‘ఆర్ఆర్ఆర్’ లో మూడే అక్షరాలు ఉన్నాయని, ”ఫలానా అబ్బాయి ఫలనా అమ్మాయి” (PAPA) లో నాలుగు అక్షరాలు ఉన్నాయి” అంటూ శ్రీనివాస్ అవసరాల సరదాగా బదులిచ్చారు. ఆ తర్వాత ఫస్ట్ లుక్ జనవరి 2న రాబోతుందని తెలిపారు. ఆ ప్రకారంగా ఈ రోజు ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఈ సినిమా గురించి నిర్మాతలు మాట్లాడుతూ, ”ఒక దశాబ్దం పాటు ఓ జంట మధ్య సాగే ప్రేమ ప్రయాణమే ఈ సినిమా కథ. హెచ్చు తగ్గులతో కూడిన ఆ ప్రయాణం ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. ఈ చిత్రం 18 సంవత్సరాల నుండి 28 సంవత్సరాల వయస్సు వరకు సాగే వారి ప్రయాణంలోకి ప్రేక్షకులను తీసుకువెళుతుంది. ఇందులో ప్రేమ సన్నివేశాలు చాలా సహజంగా హృదయాన్ని హత్తుకునేలా ఉంటాయి. ప్రేమను ఇంద్రధనస్సు లాగా ఏడు విభిన్న రంగులలో దర్శకుడు శ్రీనివాస్ ప్రదర్శించాడు. ఈ చిత్రానికి అతను రాసిన సంభాషణలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి” అని అన్నారు.

గతంలో నాగశౌర్య – శ్రీనివాస్ అవసరాల కలయికలో వచ్చిన రెండు చిత్రాలకు అద్భుతమైన సంగీతం అందించిన కళ్యాణి మాలిక్, ‘ఫలానా అబ్బాయి ఫలనా అమ్మాయి’కి సంగీతం అందిస్తుండటం విశేషం. ఈ సినిమా చిత్రీకరణ ఇటీవలే పూర్తయింది. విడుదల తేదీతో పాటు సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Malvika Nair
  • Naga Shaurya
  • Phalana Abbayi Phalana Ammayi
  • Srinivas Avasarala

తాజావార్తలు

  • Koratala Siva: అయ్యో ‘దేవర’.. టాప్ డైరెక్టర్‌కు దొరకని హీరోలు.. నిజమేనా?

  • Iran Counter: అమెరికాతో ఎలాంటి చర్చలు జరగలేదు.. ‘ట్రంప్ భయపడ్డాడు’.. ఇరాన్ కౌంటర్..

  • Chirag Paswan: బీహార్‌ ముఖ్యమంత్రి పదవిపై చిరాగ్ పాశ్వాన్ కీలక ప్రకటన

  • Maganti Gopinath Daughters : ORRపై ఘోర ప్రమాదం.. మాగంటి గోపీనాథ్ కుమార్తెలకు గాయాలు.

  • Rehman Dakait: దావూద్ ఇబ్రహీంను తమ్ముడ్ని అత్యంత దారుణంగా చంపిన రెహ్మాన్ డకాయిట్

ట్రెండింగ్‌

  • Upcoming Smartphones: స్మార్ట్‌ఫోన్ బూం.. ఈ వారంలో లాంచ్ కాబోతున్న సరికొత్త స్మార్ట్‌ఫోన్స్ ఇవే..!

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions