Rakshana: పాయల్ పాప పోలీసయ్యింది. క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘రక్షణ’ పోస్టర్ చూశారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Payal Rajput’s crime investigative thriller “Rakshana” racing for release: ‘Rx100’, ‘మంగళవారం’ వంటి సినిమాలతో తనదైన గుర్తింపును సంపాదించుకున్న హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న సినిమా ‘రక్షణ’. రోషన్, మానస్ తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ లో పాయల్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో మెప్పించబోతున్నారు. ఇక ఈ మూవీ శరవేగంగా తెరెక్కుతోంది. హరిప్రియ క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రణదీప్ ఠాకోర్ దర్శకత్వం వహిస్తూ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శరవేగంగా రూపొందుతోన్న ఈ సినిమాను త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకు రావటానికి సన్నాహాలు చేస్తున్నారు దర్శక నిర్మాత ప్రణదీప్ ఠాకోర్. ఇక ఈ సినిమా టైటిల్ పోస్టర్‌ను ఈరోజు మేకర్స్ విడుదల చేశారు. ఇప్పటి వరకు పాయల్ రాజ్‌పుత్ చేసిన సినిమాలకు ఇది పూర్తి భిన్నమైన సినిమా అని సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో సినిమా ఆసాంతం కట్టిపడేయనున్న ఈ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌లో తొలిసారి పోలీస్ ఆఫీసర్‌గా పాయల్ మెప్పించబోతున్నారని అంటున్నారు.
‘Shivam Bhaje’: ఆసక్తికరంగా ‘శివం భజే’ ఫస్ట్ లుక్
Also Read
ఇక దర్శక నిర్మాత ప్రణదీప్ ఠాకోర్ మాట్లాడుతూ ‘‘రక్షణ ఓ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ మిస్టరీ డ్రామా. పాయల్ రాజ్‌పుత్‌ను సరికొత్త కోణంలో చూపించే సినిమా. నటిగా ఆమెకు మంచి ఇమేజ్ను తీసుకొస్తుంది. ఒక పోలీస్ ఆఫీసర్ జీవితంలో జరిగిన సంఘటన స్పూర్తితో రాసిన కథతో సినిమా రూపొందింది. ఏ దశలోనూ రాజీ పడకుండా ఉన్నత నిర్మాణ విలువలతో సినిమాను తెరకెక్కించాం. నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం” అన్నారు. పాయల్ రాజ్‌పుత్, రోషన్, మానస్, రాజీవ్ కనకాల, వినోద్ బాల, శివన్నారాయణ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్‌తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్‌తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!