Payal Rajputh: పెళ్లి కానీ మగాళ్లే కాదు.. పెళ్ళైన మగాళ్లు కూడా దానికోసమే వెతుకుతున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Payal Rajputh:ఆర్ఎక్స్ 100 సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన బ్యూటీ పాయల్ రాజ్ పుత్. ఈ సినిమాలో హీరోను మోసం చేసే ఇందు పాత్రలో నటించి.. ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయింది. అమ్మడి క్రేజ్ అప్పట్లో ఎలా ఉండేది అంటే.. ఏ సినిమా చూసినా.. ఏ అమ్మాయిని చూసినా ఇందులా ఉండొద్దు అని చెప్పుకొచ్చారు. ఆ క్రేజ్ చూసిన ఇండస్ట్రీ.. ఈ అమ్మాయికి ముందు ముందు తిరుగుండదు.. వరుస అవకాశాలు అందుకొని స్టార్ హీరోయిన్ గా చెలామణి అవుతుంది అనుకున్నారు. కానీ, అందరు అనుకున్నట్లు ఏం జరగలేదు. ఈ సినిమా తరువాత అమ్మడికి అవకాశాలు వచ్చినా విజయాలు మాత్రం దక్కలేదు. ఎంతగా అందాలను ఆరబోసినా.. ఇంటిమేటెడ్ సీన్స్ లో నటించినా కూడా పాయల్ కు మాత్రం హిట్ అందలేదు. దీంతో సోషల్ మీడియాలో సెగలు పుట్టించడం మొదలుపెట్టింది. అందాలను ఆరబోస్తూ కుర్రకారును హీటెక్కిస్తూ కాలం వెళ్లదీస్తుంది. ఈ మధ్యనే మాయాపేటిక సినిమాలో ఒకపాత్రలో నటించిన పాయల్.. ప్రస్తుతం ఆర్ఎక్స్ 100 డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్న మంగళవారం సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాపైనే అమ్మడి ఆశలన్నీ ఉన్నాయి.
The Soul Of Satya: కలర్స్ స్వాతితో సాయి ధరమ్ తేజ్ పెళ్లి..
Also Read
- Tollywood Comeback: స్టార్ హీరోల ‘సాలిడ్ కంబ్యాక్’: రికార్డుల మోత మోగిస్తున్న 2026 టాలీవుడ్!
- Shavukaru Janaki : వెండితెర 'షావుకారు' జానకి ఇకలేరు.. ఏడు పదుల సినీ ప్రస్థానానికి ముగింపు
- Arjun Reedy Ice Scene: 'ఐస్ వేసుకునే సీన్' రాగానే నిర్మాతలు ఆపెయ్యమనేవాళ్లు..!
- Spirit: 'స్పిరిట్'లో చిరంజీవి, డాన్ లీ ఉన్నారా..?
ఇక తాజాగా పాయల్ భారతీయ వివాహ వ్యవస్థను అవమానించింది అంటూ నెటిజన్స్ మండిపడుతున్నారు. ఇన్స్టాగ్రామ్ లో ఇటీవలే పాయల్ ఒక పోస్ట్ పెట్టింది. ” మీరు ఇప్పటివరకు మీ సోల్ మేట్ ను కనిపెట్టలేకపోయారా..? నిరుత్సాహపడకండి. ఇప్పటికీ.. పెళ్ళైన మగాళ్లు కూడా ఇంకా తమ సోల్ మేట్ కోసం వెతుకుతూనే ఉన్నారు” అని అర్ధం వచ్చే కోట్ ను పోస్ట్ చేసింది. దీంతో నెటిజన్స్ పాయల్ ను ఏకిపారేస్తున్నారు. అంటే .. ఏంటి..? పెళ్లి తరువాత కూడా సోల్ మేట్స్ కోసం తిరుగుతూ పెళ్లాలను వదిలేస్తున్నారా.. ? విడాకులు తీసుకుంటున్నారా.. ? అని కొందరు.. పెళ్ళైన మగాళ్లు గురించి.. వాళ్ళకి కావాల్సిందాని గురించి నీకెందుకు పాప.. ? అని ఇంకొందరు కామెంట్స్ పెడుతున్నారు. మరి దీనిపై పాయల్ పాప ఎలా స్పందిస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
Laura Wright: ‘జన గణ మన’ గేయంపై బ్రిటిష్ సింగర్ కీలక వ్యాఖ్యలు!
-
YS Viveka M*urder Case: వైఎస్ వివేకా కేసులో ఈడీ కీలక ప్రకటన.. అవినాష్ రెడ్డి ఇంట్లో రూ.24 లక్షలు సీజ్
-
Drug Syndicate : డ్రగ్స్ రాజధానిపై ‘ఈగల్ ఫోర్స్’ ఉక్కుపాదం.. రూ.6 కోట్ల ఆస్తులు జప్తు.!
-
Deputy CM Pawan Kalyan: పవన్ కల్యాణ్‌కు ఆయుర్వేద థెరపీ.. రేపు కేరళకు డిప్యూటీ సీఎం
-
Makkah: మక్కా ఒప్పందంలోకి బంగ్లాదేశ్! భారత్‌కు ముప్పు పొంచి ఉందా?
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్‌తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్‌కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్‌తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!