Payal Ghosh: బాలీవుడ్ నటి పాయల్ ఘోష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అసలు ఈ అమ్మడు వివాదాలు లేకుండా ఒక్కరోజు కూడా ఉండదు అంటే అతిశయోక్తి లేదు. ఎన్టీఆర్ నటించిన ఊసరవెల్లి సినిమాలో తమన్నా ఫ్రెండ్ గా నటించి మెప్పించిన ఈ చిన్నది .. ఇక్కడ అంతగా అవకాశాలు రాకపోవడంతో బాలీవుడ్ లోనే స్టైల్ అయిపొయింది. ఇక డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ తనను వేధించాడని సంచలన వ్యాఖ్యలు చేసి హాట్ టాపిక్ గా మారింది. ఆ తరువాత సందు దొరికినప్పుడల్లా.. ఎవరో ఒకరు తన జీవితం నాశనం చేసారంటూ చెప్పుకొస్తూనే ఉంది. ఇక తాజాగా పాయల్.. సలార్ సినిమాపై పడింది. ప్రభాస్ నటించిన సలార్ రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ ను షేక్ చేస్తుంటే.. ఈమె మాత్రం సలార్ ఒక చెత్త సినిమా అని ట్వీట్ చేసి టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉండే పాయల్.. ఈరోజు సండే కావడంతో అభిమానులతో చిట్ చాట్ చేసింది. అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పుకొచ్చింది.
ఇక ఈ నేపథ్యంలోనే ” 2023లో విడుదలైన సినిమాలన్నీ చెత్తగా ఉన్నాయి. ఒక్కటీ కూడా చూడలేని విధంగా ఉన్నాయి. డంకీ, సలార్ కూడా చెత్తగా ఉన్నాయి. తన కెరీర్‌లో మొదటిసారి రాజ్ కుమార్ హిరానీ ఫ్లాప్ సినిమా తీశాడు. డంకీ, సలార్ రెండు చెత్త సినిమాలే. అయితే సలార్ సినిమాకు భారీ కలక్షన్లు వస్తాయి. ఎందుకంటే ప్రభాస్ యంగ్ అండ్ పవర్‌ఫుల్ పర్సన్. ఆయనకు భారీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది” రాసుకొచ్చింది. దీంతో పాటు జవాన్, పఠాన్ సినిమాలు కూడా బాగోలేదని, జనాలను పిచ్చోళ్లను చేస్తున్నారని చెప్పుకొచ్చింది. ఇక ఇంకోపక్క ఈ భామ ఎన్టీఆర్ ను పొగిడేసింది. ఎన్టీఆర్ జెంటిల్ మెన్ కదా అని నెటిజన్ అడుగగా.. ” అవును.. నాకు ఇంకా గుర్తుంది. థాయ్ ల్యాండ్ లో రోడ్డుపై నేను బట్టలు మార్చుకుంటున్నాను.. అది చూసి తారక్ నాపై కోప్పడ్డాడు. మహిళలను గౌరవించడం సౌత్ పీపుల్ కు బాగా తెలుసు” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ ట్వీట్స్ నెట్టింట వైరల్ గా మారింది. సరదాసరదాకే ప్రభాస్ సినిమాను ట్రోల్ చేస్తేనే ఊరుకొని ప్రభాస్ ఫ్యాన్స్.. ఇంత పెద్ద హిట్ అయినా కూడా పాయల్ చెత్త అంది అంటే ఊరుకుంటారా.. ? అనేది చూడాలి.
I still remember how @tarak9999 got angry on me in Thailand , because I was changing my dress on road… this is how south people respect women 🥹
— Payal Ghoshॐ (@iampayalghosh) December 24, 2023
#dunki bhi Faltu film au Aur #Salaar bhi lekin #Salaar will own more money because #Prabhas is not vfxd 😂he’s young and powerful.. dono film ho ghatiya hai 😅✔️
— Payal Ghoshॐ (@iampayalghosh) December 24, 2023