Pawan Kalyan: టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి ఇంట తీవ్ర విషాదం చోసుచేసుకున్న విషయం విదితమే. నేటి ఉదయం కీరవాణి తల్లి భానుమతి మృతి చెందారు. గత కొన్నిరోజుల నుంచి వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె చికిత్స పొందుతూ మృతిచెందారు. దీంతో కీరవాణి కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఈ విషయం తెలియడంతో సినీ ప్రముఖులు ఆమెకు సంతాపం తెలుపుతూ కీరవాణి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నారు. తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. కీరవాణి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలుపుతూ ట్వీట్ చేశాడు.
” ప్రముఖ సంగీత దర్శకులు శ్రీ కీరవాణి గారి మాతృమూర్తి శ్రీమతి భానుమతి గారు కన్ను మూశారని తెలిసి చింతించాను. శ్రీమతి భానుమతి గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. భానుమతి గారు భర్త శ్రీ శివశక్తి దత్తగారికి, ఆమె తనయుడు శ్రీ కీరవాణి గారికి, ఇతర కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను” అంటూ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. ఇకపోతే కీరవాణి.. పవన్ నటిస్తున్న హరిహర వీరమల్లుకు సంగీతం అందిస్తున్న విషయం తెల్సిందే. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ కానుంది.