Software Engineers Death: పోటీపడి 19 బీర్లు తాగారు.. మద్యం ఎక్కువై ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు మృతి
- బండ వడ్డీపల్లిలో ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగుల మృతి కేసు..
- అతిగా మద్యం సేవించడమే మృతికి కారణమని వెల్లడించిన పోలీసులు..
- సంక్రాంతి సందర్భంగా ఆరుగురు స్నేహితులతో కలిసి పార్టీ..
- పార్టీ మధ్యలో పోటీపడి మద్యం సేవించిన మణికుమార్ (34), పుష్పరాజ్ (26)
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Software Engineers Death: పోటీపడి 19 బీర్లు తాగిన ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయిన ఘటన కలకలం రేపుతోంది.. అన్నమయ్య జిల్లా కె.వి.పల్లి మండలం బండ వడ్డీపల్లిలో ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు మృతి చెందిన ఘటన సంచలనంగా మారింది.. అతిగా మద్యం సేవించడమే మృతికి కారణమని రాయచోటి డీఎస్పీ కృష్ణమోహన్ తెలిపారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఆరుగురు స్నేహితులు కలిసి పార్టీ ఏర్పాటు చేసుకున్నారు. ఈ పార్టీ సమయంలో మణికుమార్ (34), పుష్పరాజ్ (26) అనే ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు పరస్పరం పోటీపడి మద్యం సేవించారు. గత శనివారం మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 7.30 గంటల వరకు ఇద్దరూ కలిసి మొత్తం 19 బడ్వైజర్ టిన్ బీర్లు తాగినట్లు పోలీసులు గుర్తించారు. అతిగా మద్యం సేవించడం వల్ల తీవ్ర డీహైడ్రేషన్‌కు గురైన ఇద్దరి పరిస్థితి విషమించింది. వెంటనే ఆస్పత్రికి తరలిస్తుండగా మణికుమార్ మార్గమధ్యలో మృతి చెందగా, పుష్పరాజ్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ప్రాథమిక విచారణలోనూ, పోస్టుమార్టం నివేదికలోనూ మృతికి అతిగా మద్యం సేవించడమే కారణమని స్పష్టమైనట్లు పోలీసులు వెల్లడించారు.
Read Also: Uttarakhand: కాంగ్రెస్ ఎమ్మెల్యే కుమారుడిపై దాడి.. ఐసీయూలో చేరిక
Also Read
- CM Chandrababu: రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్.. రైతుల ఆదాయంపై చంద్రబాబు ఫోకస్
- CM Chandrababu: కరువు సీమ.. సిరుల సీమగా మారుతుంది.. సీమ చరిత్రలో అక్టోబర్ 2 చిరస్థాయిగా నిలిచిపోతుంది..
- Pawan Kalyan: కరువు నేల నుంచి ప్రపంచ స్థాయి ఉద్యానవన కేంద్రంగా.. పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
- Nara Lokesh: సీమ రైతుల సత్తా ప్రపంచానికి తెలియాలి.. లోకేష్ పిలుపు
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!