టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతోంది పూజా హెగ్డే.. వరుస విజయాలను అందుకొని గోల్డెన్ లెగ్ గా పేరు తెచ్చుకున్న అమ్మడు ఎట్టకేలకు ఒక పవర్ ఫుల్ ఛాన్స్ ని కొట్టేసింది. ఇప్పటివరకు మెగా కాంపౌండ్ లో మెగా హీరోలతో రొమాన్స్ చేసిన ఈ బ్యూటీ త్వరలో పవన్ కళ్యాణ్ సరసన కనిపించనుందని టాక్. గబ్బర్ సింగ్ తరువాత హరీష్ శంకర్- పవన్ కాంబోలో వస్తున్న భవదీయుడు భగత్ సింగ్ చిత్రంలో పవన్ సరసన పూజ హెగ్డే నటించనున్నట్లు సమాచారం. ఇక ఇప్పడూ అది అఫీషియల్ కాకపోయినా హరీష్ శంకర్ ఒక ఫంక్షన్ లో నోరు జారడంతో కన్ఫర్మ్ అని తెలుస్తోంది. ఇందుకు పూజా కూడా పచ్చజెండా ఊపేసిందంట.
ప్రస్తుతం పవన్ ‘భీమ్లా నాయక్’ షూటింగ్ ని పూర్తి చేసి హరహర వీరమల్లు షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఈ చిత్రం తరువాత భవదీయుడు సెట్స్ మీదకు వెళ్లనుంది. ఏదిఏమైనా ఈ ఛాన్స్ లు చూస్తుంటే నిజంగానే బుట్టబొమ్మ గోల్డెన్ లెగ్ లానే కనిపిస్తుంది. ఏకంగా పవన్ సరసనే ఛాన్స్ పట్టిందంటే మామలు విషయం కాదని పవన్ అభిమానులు గుసగుసలాడుతున్నారు.