Site icon NTV Telugu

OG : ఓటీటీలోకి ఓజీ మూవీ.. డేట్, టైమ్ ఫిక్స్..

Og

Og

OG : పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ నటించిన ఓజీ థియేటర్లలో మంచి హిట్ అయింది. సుజీత్ డైరెక్షన్ లో వచ్చిన ఈ గ్యాంగ్ స్టర్ డ్రామా ఫ్యాన్స్ కు పిచ్చిగా నచ్చేసింది. ఇందులో పవన్ చేసిన యాక్షన్ సీన్లు, ఎలివేషన్లు మాస్ ఆడియెన్స్ ను కట్టిపడేశాయి. సెప్టెంబర్ 25న రిలీజ్ అయిన ఈ మూవీ.. బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇందులో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటించగా.. ఇమ్రాన్ హష్మీ విలన్ గా చేశాడు. థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా ఆడిన ఓజీ సినిమా ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ అయ్యేందుకు రెడీ అయింది. ఈ సినిమాను నెట్ ఫ్లిక్స్ లో అక్టోబర్ 23 నుంచి స్ట్రీమింగ్ చేస్తున్నారు.

Read Also : Mahesh Babu : 5 వేల మందికి హార్ట్ ఆపరేషన్లు.. గొప్పోనివయ్యా మహేశ్ బాబు..

దీంతో పవన్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. థియేటర్లలో హిట్ అయిన సినిమాలకు ఓటీటీలోనూ మంచి డిమాండ్ ఉంటుంది. ఇప్పుడు ఓజీకి కూడా అలాంటి డిమాండ్ ఉంటుందనే ప్రచారం అయితే జరుగుతోంది. ఇక ఈ సినిమాకు సీక్వెల్, ప్రీక్వెల్ ఉంటాయని డైరెక్టర్ సుజీత్, పవన్ ప్రకటించారు. కానీ దానికి ఇంకొంచెం టైమ్ పట్టేలా ఉంది. ఓజీ సినిమాతో పవన్ ను ఎలా చూడాలి అని ఇన్నేళ్లు ఫ్యాన్స్ భావించారో అలాగే చూపించాడు సుజీత్. పవన్ కు వీరాభిమాని అయిన సుజీత్.. ఓజీ సినిమాతో అలాంటి మ్యాజిక్ క్రియేట్ చేశాడు. చాలా ఏళ్లుగా హిట్ కోసం వెయిట్ చేస్తున్న పవన్ కు ఈ సినిమాతో ఆ లోటు తీరిపోయింది.

Read Also : Bigg Boss 9 : దివ్వెల మాధురి వల్ల రీతూ చౌదరికి పెరుగుతున్న క్రేజ్..

Exit mobile version