Pawan Kalyan Ane Nenu: ట్రెండింగ్ లో పవన్ కళ్యాణ్ అనే నేను!
- పవన్ కళ్యాణ్ అనే నేను అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం
- ట్రెండింగ్ లో పవన్ కళ్యాణ్ అనే నేను హ్యాష్ ట్యాగ్
- గేమ్ చేంజర్ పవన్ కళ్యాణ్ అనే హ్యాష్ ట్యాగ్ కూడా ట్రెండింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan Ane Nenu Trending in Social Media: ఆంధ్ర ప్రదేశ్ లోని గన్నవరం ఎయిర్ పోర్ట్ సమీపంలో కేసరపల్లి ఐటీ పార్క్ వేదికగా నూతన మంత్రివర్గం ప్రమాణస్వీకారం ఘనంగా జరుగుతోంది. ముందుగా నూతన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం చేయగా అనంతరం ఒక్కొక్కరుగా మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. చంద్రబాబు ప్రమాణస్వీకారం ముగిసిన వెంటనే పవన్ కళ్యాణ్ అనే నేను అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో వేడుకకు హాజరైన అశేష జన వాహిని నుంచి హర్షాతిరేకలు వ్యక్తమయ్యాయి. పెద్ద ఎత్తున కరతాళ ధ్వనులతో పవన్ కళ్యాణ్ ను వారంతా అభినందించారు.
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ అనే నేను అంటూ ప్రమాణం.. దద్దరిల్లిన వేదిక
Also Read
ఇక పవన్ కళ్యాణ్ ప్రమాణస్వీకారం నేపథ్యంలో సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ అనే నేను అనే హ్యాష్ ట్యా ట్రెండ్ అవుతుంది. ఇప్పటికే ట్విట్టర్ సహా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లో ఈ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతుంది. అదే కాదు గేమ్ చేంజర్ పవన్ కళ్యాణ్ అనే హ్యాష్ ట్యాగ్ కూడా ట్రెండ్ అవుతోంది. ఇక పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారానికి ఆయన భార్య అన్నా లెజీనోవా, అకిరా నందన్, ఆధ్యా సహ మెగా కుటుంబ సభ్యులు కూడా హాజరయ్యారు. నిన్న సాయంత్రం మెగాస్టార్ చిరంజీవి తన భార్య సురేఖ సహా మనవరాళ్ళతో స్పెషల్ ఫ్లైట్లో బేగంపేట్ నుంచి గన్నవరం వచ్చారు. పవన్ ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో ఆయన భార్య ఫోన్లో షూట్ చేస్తూ ఉండడం కూడా హైలెట్ అయింది.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!