PK MB: మహేశ్ బాబుకి స్పెషల్ బర్త్ డే విషెష్ చెప్పిన పవర్ స్టార్…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబుకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉండే క్రేజే వేరు. బాక్సాఫీస్ నుంచి సోషల్ మీడియా వరకూ ఈ ఇద్దరు హీరోల మధ్య చాలా హెల్తీ కాంపిటీషన్ ఉంటుంది. సినిమాల పరంగా రైవల్రీ ఉన్నా కూడా ఈ ఇద్దరు హీరోలకి మ్యూచువల్ ఫాన్స్ ఎక్కువగా ఉంటారు. పవన్ కళ్యాణ్ కి అండగా మహేష్.. మహేష్ కి అండగా పవన్ నిలిచిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అందుకే సినీ అభిమానులు త్రివిక్రమ్ డైరెక్షన్ లో మహేష్-పవన్ కళ్యాణ్ కలిసి నటిస్తే చూడాలని కోరుకుంటూ ఉంటారు. ఇదిలా ఉంటే ఈరోజు మహేష్ బాబు పుట్టిన రోజు కావడంతో పవర్ స్టార్ విషెష్ తెలిపాడు.
“శ్రీ మహేష్ బాబుకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. తెలుగు చలన చిత్రసీమలో తనదైన పంథా కలిగిన అగ్రశ్రేణి కథానాయకుడు శ్రీ మహేష్ బాబుకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. శ్రీ మహేష్ బాబు కథానాయకుడిగా అందుకున్న ఘన విజయాలు తెలుగు సినీ పరిశ్రమ వృద్ధికి ఎంతో దోహదపడ్డాయి. తండ్రి నటశేఖర కృష్ణ గారి అడుగుజాడల్లో వెళ్తూ, విభిన్న పాత్రల్లో మెప్పించే అభినయ సామర్థ్యం ఆయన సొంతం. సోదరసమానుడైన శ్రీ మహేష్ బాబు మరిన్ని విజయాలు అందుకోవాలని, సంపూర్ణ ఆనందంతో ఉండాలని ఆకాంక్షిస్తున్నాను” అంటూ పవన్ కళ్యాణ్ నుంచి మహేష్ బాబుకి బర్త్ డే విష్ వచ్చింది. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు మ్యూచువల్ ఫాన్స్ ఈ ట్వీట్ ని వైరల్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. మరి మహేష్ బాబు నుంచి పవన్ కళ్యాణ్ చేసిన విష్ కి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది అనేది చూడాలి.
Also Read
- Bloody Romeo : రోమియో పక్కన జూలియట్‌గా ప్రీతిముకుందన్?
- Aadarsha Kutumbam : 'ఆదర్శ కుటుంబం' మళ్లీ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
- Srinidhi Shetty: "కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు.." శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
- Sardar 2 OTT: ఓటీటీలో 'సర్దార్ 2' ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
శ్రీ మహేష్ బాబుకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు – శ్రీ పవన్ కళ్యాణ్ గారు
తెలుగు చలన చిత్రసీమలో తనదైన పంథా కలిగిన అగ్రశ్రేణి కథానాయకుడు శ్రీ మహేష్ బాబుకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. శ్రీ మహేష్ బాబు కథానాయకుడిగా అందుకున్న ఘన విజయాలు తెలుగు సినీ…
— JanaSena Party (@JanaSenaParty) August 9, 2023
తాజావార్తలు
-
Komaki MG-Pro+ Electric Scooter: రూ.85,999కే 150+KM రేంజ్.. 4 వేరియంట్లతో వచ్చిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అదిరింది!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
ట్రెండింగ్
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..