ఎట్టకేలకు ‘హరిహర వీరమల్లు’పై దృష్టి పెట్టిన పవన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న పీరియాడికల్ మూవీ “హరి హర వీరమల్లు” సినిమా మళ్లీ వార్తల్లోకి వచ్చింది. ఎట్టకేలకు పవన్ ఈ సినిమాపై దృష్టి పెట్టాడు. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా త్వరలో షూటింగ్‌ను పునఃప్రారంభించనుంది. నెక్స్ట్ షెడ్యూల్ గురించి చర్చించడానికి దర్శకుడితో సహా మేకర్స్ పవర్ స్టార్‌ను కలిశారు. అతి త్వరలో కొత్త షెడ్యూల్ హై-ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్స్‌తో ప్రారంభం కానుంది. దర్శకుడు స్క్రిప్ట్‌లో కొన్ని మార్పులు చేసి, నిన్న జరిగిన సెషన్‌లో పవన్ కు వివరించాడు. నిర్మాత ఏఎమ్ రత్నం తదితరులు స్క్రిప్ట్ రీడింగ్ సెషన్స్‌లో పాల్గొన్నారు.
Read Also : సమతా మూర్తి విగ్రహాన్ని సందర్శించనున్న పవన్ కళ్యాణ్
Also Read
ఈ చిత్రం 50 శాతం షూటింగ్‌ను ఇప్పటికే పూర్తి చేసుకుంది. కరోనా మహమ్మారి థర్డ్ వేవ్ కారణంగా మిగిలిన భాగం ఆగిపోయింది. ఇప్పుడు ఆ మిగిలిన షూటింగ్ ను తిరిగి ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. నిధి అగర్వాల్ కథానాయికగా నటించిన ఈ పాన్-ఇండియా సినిమాలో పవన్ కళ్యాణ్ రాబిన్‌హుడ్ తరహా పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే. మెగా సూర్య ప్రొడక్షన్ వారు నిర్మిస్తున్న ఈ పీరియాడికల్ డ్రామాకి ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. మరోవైపు పవన్ కళ్యాణ్, రానా కలిసి నటించిన ‘భీమ్లా నాయక్’ కూడా విడుదలకు సిద్ధంగా ఉంది.
Loved the deep conversations with @PawanKalyan sir on poetry, politics, anthropology and linguistics.
Had a great session discussing lyrics and dialogues of his upcoming project along with @DirKrish @AMRathnamOfl sir and writer Kannan. pic.twitter.com/8mxG9nl4E8
— Madhan Karky (@madhankarky) February 6, 2022
తాజావార్తలు
-
Harish Rao: సామాన్యుడిపై ధరల భారం.. ప్రభుత్వం నిద్రమత్తులో ఉందా?
-
ICC fine: వెస్టిండీస్‌తో ఓటమి.. టీమిండియాకు బిగ్ షాక్ ఇచ్చిన ఐసీసీ..
-
Oppo F35, F35 Pro: ఒప్పో F35, F35 Pro భారత్‌లో లాంచ్.. రూ.38,999కే 8,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్!
-
Supreme Court: జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు
-
Karimnagar Collectorate : కలెక్టరేట్లో బిగ్ షాక్.. తృటిలో తప్పిన ప్రమాదం.!
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?