ఉస్తాద్ భగత్ సింగ్‌కు ఓజి షాక్ ఇచ్చాడా? అంటే, ఔననే టాక్ నడుస్తోంది. సోషల్ మీడియా బజ్ ప్రకారం.. ఉస్తాద్ ప్లేస్‌లో ఓజి షూటింగ్‌కు రంగం సిద్దమవుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ నెల 26 నుంచి ‘ఉస్తాద్ భగత్ సింగ్’కి పవన్ డేట్స్ ఇచ్చాడనేది రీసెంట్ అప్డేట్ కానీ ఇప్పుడు ఈ నెల 27 నుంచి కాకినాడ పోర్ట్‌లో ఓజి షూటింగ్‌కు ప్లాన్ చేస్తున్నారనే న్యూస్ ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతోంది. గత కొన్ని రోజులుగా పవన్ లేని సీన్స్ కంప్లీట్ చేశాడు సుజీత్. నెక్స్ట్ కాకినాడ షెడ్యూల్‌లో పవన్ జాయిన్ అవనున్నాడని తెలుస్తోంది. అయితే మరో వెర్షన్ ప్రకారం.. 26 నుంచి 3, 4 రోజుల పాటు ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ ఉంటుందని.. హైదరాబాద్ గచ్చిబౌళిలో షూట్ ప్లాన్ చేస్తున్నట్టుగా ట్రెండ్ చేస్తున్నారు. దీంతో పవన్.. ఉస్తాద్ భగత సింగ్ షూటింగ్‌లో పాల్గొంటాడా? లేదంటే ఓజి షూటింగ్‌లో జాయిన్ అవుతాడా? అనేది క్లారిటీ లేకుండా పోయింది.
ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్‌లోనే పవన్ జాయిన్ అవనున్నాడని సమాచారం. రీసెంట్‌గా ఈ సినిమా ఓ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. రేపో మాపో మేకర్స్ నెక్స్ట్ షెడ్యూల్ పై అప్డేట్ ఇచ్చే ఛాన్స్ ఉంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాను… గబ్బర్ సింగ్ తర్వాత ఆ రేంజులో అదిరిపోయే యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిస్తున్నాడు హరీశ్ శంకర్. ఇక ఓజిని యంగ్ డైరెక్టర్ సుజీత్ పవర్ ఫుల్ గ్యాంగ్‌స్టర్ డ్రామాగా రూపొందిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ ఓజి గ్లింప్స్ సినిమా పై అంచనాలను పీక్స్‌కు తీసుకెళ్లింది కానీ హరిహర వీరమల్లు అప్డేట్ మాత్రం బయటికి రావడం లేదు. పవన్ నటిస్తున్న ఈ మూడు సినిమాలపై భారీ అంచనాలున్నాయి. మరి ఓజి, ఉస్తాద్, హరిహర వీరమల్లు ఎప్పుడు రిలీజ్ అవుతాయో చూడాలి.