HHVM : పవన్ కల్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు మూవీ మరికొన్ని గంటల్లో రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా మూవీ గురించి అనేక విషయాలు లీక్ అవుతున్నాయి. పవన్ నుంచి చాలా ఏళ్ల తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఫ్యాన్స్ ఆతృతగా వెయిట్ చేస్తున్నారు. పవన్ కల్యాణ్ నుంచి మొదటిసారి వస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా ఇది. అయితే ఈ సినిమా గురించి లేటెస్ట్ గా మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ బయటకు వచ్చింది. అదేంటంటే ఈ సినిమాలో యాక్షన్ సీన్లే హైలెట్ కాబోతున్నాయంట. ట్రైలర్ లో మనకు పవన్ యాక్షన్ సీన్లు ఓ రేంజ్ లో ఉంటాయని హింట్ ఇచ్చేశారు. ప్రమోషన్లలో కూడా యాక్షన్ సీన్ల గురించే ఎక్కువగా టాపిక్ వచ్చింది. పవన్ కూడా తాను ఓ యాక్షన్ సీన్ ను కొరియోగ్రఫీ చేశానని ఓపెన్ అయ్యాడు.
Read Also : HHVM : ప్రీమియర్స్ తోనే రికార్డుల వేట.. వీరమల్లు భారీ స్కెచ్..
పవన్ గతంలో ఏ సినిమాకు చేయనంతగా ఈ మూవీ కోసం యాక్షన్ సీన్లు చేశాడంట. అవే మూవీకి హైలెట్ కాబోతున్నాయని టాక్. సాధారణంగా పవన్ కల్యాణ్ గతంలో యాక్షన్ సీన్ల కోసం పెద్దగా కసరత్తులు చేయలేదు. కానీ వీరమల్లు కోసం రకరకాల కసరత్తులు నేర్చుకున్నాడు. కత్తి సాము, మల్లయుద్ధం లాంటివి ఇందులో కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. అలాగే ఒళ్లు హూనం చేసేలా యాక్షన్ సీన్ల కోసం ప్రాక్టీస్ చేశాడంట. దాని రిజల్ట్ మనకు వీరమల్లులో కనిపించబోతోంది. ఇవే కాకుండా మూవీ కోసం పవన్ గుర్రపు స్వారీ, కొన్ని రకాల స్టంట్లు కూడా చేశాడు. ఈ మూవీ తనకు ఎంతో స్పెషల్ అని.. రాజకీయాల్లోకి వెళ్లాక సినిమాల కోసం తాను కష్టపడటం మానేశాను అనే టాక్ రాకుండా ఉండేందుకు ఇంతగా కష్టపడ్డట్టు తెలిపాడు పవన్.
Read Also : HHVM : నా సినిమాను ఎవరూ బాయ్ కాట్ చేయలేరు.. పవన్ ఫైర్..