Pawan Kalyan:పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలతో మరోపక్క సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఇప్పటికే పవన్ చేతిలో నాలుగైదు సినిమాలు ఉన్నాయి. ఇక సినిమాల విషయం పక్కన పెడితే రాజకీయంగాను ఈ సమయం పవన్ కు చాలా ముఖ్యం. అందుకే పవన్ ఒక్క నిమిషం కూడా సమయాన్ని వేస్ట్ చేయడం లేదు. అయితే సినిమాలు.. లేకపోతే ప్రచారాలు. ఇక ఫ్యామిలీని పవన్ పక్కన పెట్టారనే చెప్పాలి. పవన్ మూడో భార్య అన్నా లెజినోవా ప్రస్తుతం రష్యాలో ఉంటుంది. క్రిస్టమస్ నెల కాబట్టి ఆమె పిల్లలతో ప్రతి ఏడాది అక్కడే ఉంటూ క్రిస్టమస్ తరువాత ఇండియా వస్తోంది.
ప్రతి ఏడాది క్రిస్టమస్ కు పవన్.. రష్యాలో భార్యతో ఉంటారని టాక్. అయితే మరి ఈసారి కూడా పవన్ రష్యా వెళ్లనున్నాడా..? అనేది హాట్ టాపిక్ గా మారింది. అందుతున్న సమాచారం ప్రకారం ఈ ఏడాది పవన్ రష్యా వెల్ళడం కష్టమే అంటున్నారు. ఇప్పటికే పవన్ ఒక పక్క హరిహర వీరమల్లు క్లైమాక్స్ లో నటిస్తున్నాడు. ఈ సినిమా తరువాత రీమేక్ వినోదాయ సీతాం రెడీ గా ఉంది. మరోపక్క ప్రచారానికి వారాహి సిద్దమయ్యింది. ఈ క్రూషియల్ టైమ్ లో పవన్ రష్యా వెళ్లి భార్యతో పండుగ చేసుకోగలడా..? అంటే లేదనే తెలుస్తోంది. సరే పండుగ రెండు రోజులు మాత్రమే కాబట్టి ఒకవేళ వెళ్లి వచ్చే ఛాన్సులు కూడా లేకపోలేదు అనేది మరికొందరి మాట. మరి క్రిస్టమస్ రోజు పవన్ ఎక్కడ ఉంటాడో చూడాలంటే ఇంకో మూడు రోజులు ఆగాల్సిందే.