HHVM : పవన్ కల్యాణ్ హరిహర వీరమల్లు సినిమా ప్రమోషన్లలో ఫుల్ బిజీగా ఉంటున్నారు. నిన్న ప్రెస్ మీట్ తో పాటు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న పవన్.. తాజాగా మంగళగిరిలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీవీకి స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో వీరమల్లు ఆలస్యానికి కారణాలను వెల్లడించారు. మేం వీరమల్లును అనుకున్నప్పుడు చాలా హై మూమెంట్ తో చేశాం. ఈ మూవీ కోసం చాలా మంది యాక్టర్లను తీసుకున్నాం. విదేశీ నటులు కూడా చాలా ఎక్కువగా ఉన్నారు. ఒక మేజర్ షెడ్యూల్ కంప్లీట్ చేసిన తర్వాత రెండు వరుస కరోనా వేవ్ లు వచ్చాయి. దాంతో విదేశీ నటులు అందరూ వాళ్ల దేశాలకు వెళ్లిపోయి తిరిగి రాలేకపోయారు.
Read Also : Pawan Kalyan : బిగ్ న్యూస్.. ఇక నిర్మాతగా మారనున్న పవన్ కల్యాణ్..
కరోనా తర్వాత ఎలాగోలా మళ్లీ అందరు నటులను గ్యాదర్ చేసుకున్నాం. షూటింగ్ జరుగుతున్నప్పుడు చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేశారు. దాంతో పూర్తి స్థాయిలో రాజకీయాల్లోనే ఉండిపోవాల్సి వచ్చింది. కూటమి పొత్తుతో అటువైపే ఉన్నాను. డేట్లన్నీ క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది. పూర్తిగా రాజకీయాల వైపే ఉన్నాను. ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆరు నెలల వరకు అడ్మినిస్ట్రేషన్ వైపు ఉండి పూర్తిగా అర్థం చేసుకున్నాను. అందుకే సినిమాకు టైమ్ ఇవ్వలేదు. ఇప్పుడు టైమ్ దొరికింది కాబట్టి పూర్తి చేశా. ఈ కారణాల వల్లే మూవీ ఆలస్యం అయింది. ఇన్నేళ్లు ఒక సినిమా కోసం నటీనటులను ఒక్కటిగా ఉంచడం కష్టం అంటూ చెప్పుకొచ్చారు పవన్ కల్యాణ్.
HHVM : Rashmi : చాలా ఇబ్బందుల్లో ఉన్నా.. రష్మీ సంచలన నిర్ణయం..!
