Rashmi : యాంకర్ రష్మీ సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం వరుస షో లతో బిజీగా ఉంటుంది. గతంలో సినిమాలు చేసినా పెద్దగా పాపులర్ కాలేకపోయింది. కానీ బుల్లితెరపై మాత్రం వరుస షోలు చేస్తూ దూసుకుపోతోంది ఈ ముద్దుగుమ్మ. ఈ నడుమ పెద్దగా క్రేజ్ కనిపించట్లేదు. సుధీర్ తో ప్రోగ్రామ్స్ చేస్తున్నా.. రావాల్సినంత హైప్ మాత్రం రావట్లేదు. అయినా సరే ఇప్పుడు వరుస ప్రోగ్రామ్స్ చేతుల్లో ఉండటం వల్ల బిజీగా గడుపుతోంది. ఇక ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రష్మీ.. షాకింగ్ డెసీషన్ తీసుకుంది. కొన్ని రోజుల పాటు తాను సోషల్ మీడియాకు దూరంగా ఉండనున్నట్టు తెలిపింది. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది.
Read Also : Kingdom : కింగ్ డమ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్పుడే.. ఎక్కడంటే..?
‘పర్సనల్ లైఫ్, కెరీర్ విషయంలో చాలా ఇబ్బందుల్లో ఉన్నాను. అలాగే సోషల్ మీడియాలో చెప్పే అడ్డమైన నీతులు వినాలని లేదు. అందుకే నెల రోజుల పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నా. కాబట్టి అందరూ నన్ను అర్థం చేసుకోండి. ఇంకా నేను చాలా ఇవ్వాల్సి ఉంది. దాన్ని తిరిగి ఇవ్వడానికి నాకు శక్తి కావాలి. దాని కోసం ప్రయత్నిస్తున్నాను’ అంటూ ఎమోషనల్ పోస్టు పెట్టింది ఈ బ్యూటీ. ఆమె చేసిన పోస్టు చూసిన ఆమె ఫ్యాన్స్.. ఏమైందంటూ కామెంట్లు పెడుతున్నారు.
Read Also : HHVM : వెయ్యి కేజీల పేపర్లు రెడీ చేసిన ఫ్యాన్స్.. థియేటర్లలో ఇక రచ్చే..