Pawan Kalyan does not even remember his current movie’s name: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక పక్క సినిమాలు చేస్తూనే మరో పక్క రాజకీయాల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే నిన్ననే టీడీపీ సమన్వయ కార్యక్రమంలో పాల్గొన్న పవన్ ఈరోజు ఒక ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్ లాంచ్ ఈవెంట్‌లో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు వైరల్ అయ్యాయి. ఎందుకంటే పవన్ నటిస్తున్న సినిమా పేరు కూడా ఆయనకు గుర్తు లేదు. పవర్ స్టార్ తన సినిమా పేరును మర్చిపోయాడు, పవన్ కళ్యాణ్‌కి తన ప్రస్తుత సినిమా పేరు కూడా గుర్తులేదని అంటూ నెటిజన్లు కొందరు ఫన్నీ ట్రోల్స్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్, దర్శకుడు హరీష్ శంకర్ గబ్బర్ సింగ్ సూపర్ హిట్ తరువాత రెండవసారి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కోసం కలిసి పని చేస్తున్నారు. గతంలో వీరి కలయికలో వచ్చిన గబ్బర్ సింగ్ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. అయినప్పటికీ, వారి రెండవ సినిమా ఎందుకో తెలియదు కానీ అనేక బాలారిష్టాలు ఎదుర్కొంటోంది.
Honey Rose: బార్బీ బొమ్మకి చెల్లెలివా బాబోయ్ ప్రపంచ సుందరివా?
ఒక పక్క సినిమాల్లో మరోపక్క రాజకీయాల్లో యాక్టివ్ గా ఉన్న క్రమంలో ఆయన ఈ సినిమా అనే కాదు చేస్తున్న ఏ సినిమాకి పూర్తి స్థాయిలో షూట్ లో పాల్గొన లేకపోతున్నారు. ఇలాంటి సమయంలో ఆయన సినిమాలు ఎప్పటికి పూర్తవుతాయి? అనే విషయం మీద క్లారిటీ లేదు. ఇలాంటి క్రమంలో పవన్ కళ్యాణ్ ఈ సినిమా పేరు మర్చిపోవడం హాట్ టాపిక్ అయింది. అయితే ఇదంతా మంచిదే అంటున్నాడు దర్శకుడు హరీష్ శంకర్. సినిమా Original టైటిల్ చెప్పినా, ఇంత వైరల్ అయ్యేది కాదు పోనీలెండి అన్ని మన మంచికే హ్యాపీ దసరా అంటూ ఆయన సోషల్ మీడియాలో రాసుకొచ్చారు. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. హరీష్ శంకర్ ఇప్పటికే సినిమాలోని ముఖ్యమైన భాగాన్ని షూట్ చేశారు. ఇక మరోపక్క మేకర్స్ ఈ సినిమాకి సంబంధించిన పలు పోస్టర్లను కూడా విడుదల చేశారు. ఇక ఛానల్ లాంచ్ ఈవెంట్‌లో మాట్లాడుతున్నప్పుడు, పవన్ తన పలు సినిమాల గురించి ప్రస్తావించారు, ఈ క్రంమలోనే ‘సర్దార్ భగత్ సింగ్’ అని తప్పుగా చెప్పగా ఆ వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అయింది.