Site icon NTV Telugu

Pawan Kalyan Birthday Special : ఇండస్ట్రీలో అగ్ర హీరో.. ప్రజల్లో జనసేనాని.. పవన్ బర్త్ డే స్పెషల్..

Pawan Klayan

Pawan Klayan

Pawan Kalyan Birthday Special : పవన్ కల్యాణ్‌.. ఇది పేరు కాదు బ్రాండ్ అనేంతగా ఎదిగాడు. డబ్బు కంటే పేరు, అభిమానులనే ఎక్కువగా సంపాదించుకున్నాడు. కల్యాణ్‌ బాబుగా వచ్చి.. పవన్ కల్యాణ్‌ గా మారి పవర్ స్టార్ గా అభిమానుల గుండెల్లో నిలిచిపోయాడు. చేతు మెడమీద పెట్టాడంటే ఫ్యాన్స్ కు పూనకాలు రావాల్సిందే. హీరోగా ఎంత ఎదిగాడో.. వ్యక్తిత్వంలో అంతకు మించి ఎత్తులో నిలబడ్డాడు. సినిమాల్లోనే కాదు రాజకీయాల్లో తుఫాన్ లా దూసుకుపోతున్నాడు. అలాంటి పవన్ కల్యాణ్‌ 54వ బర్త్ డే నేడు. ఈ సందర్భంగా పవన్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.

పవన్ కల్యాణ్‌ సెప్టెంబర్ 2, 1971న ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్లలో వెంకటరావు-అంజనాదేవి దంపతులకు జన్మించాడు.ప్రాథమిక విద్య వరకు బాపట్లలో చదువుకున్న తర్వాత నెల్లూరులో ఇంటర్ పూర్తి చేసి డిప్లొమా చేశాడు. కానీ జాబ్ చేయడం ఇష్టం లేదు. ఇంట్లో ఖాళీగానే కూర్చునేవాడు. పుస్తకాలు ఎక్కువగా చదివేవాడు. ఆ టైమ్ లోనే చిరు పవన్ ను తన వద్ద ఉంచుకున్నాడు. ఆ టైమ్ లోనే పవన్ ను సినిమాల్లోకి వెళ్లమని వదిన సురేఖ సలహా ఇచ్చింది. ఇదే విషయాన్ని అన్నయ్యకు చెప్పడంతో వెంటనే సత్యంమాస్టర్ దగ్గరకు పవన్ ను యాక్టింగ్ నేర్చుకోమని పంపించాడు.

ఈ లోగా పవన్ కోసం చిరంజీవి వీవీ సత్యనారాయణ దర్శకత్వంలో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి కథను ఒకే చేసి.. 1996 జనవరిలో షూటింగ్ మొదలు పెట్టారు. ఈ మూవీ 1996 అక్టోబర్ లో రిలీజ్ అయి యావరేజ్ టాక్ తెచ్చుకుంది. కానీ ఈ సినిమాలో అందరూ చిరు తమ్ముడిగానే పవన్ ను చూశారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కోసం గోకులంలో సీత మూవీని చేశారు. ఆ టైమ్ లోనే 1997 మే నెలలో వైజాగ్ కి చెందిన నందినితో పెళ్లి అయింది. కానీ వారు ఎక్కువ కాలం కలిసి ఉండలేదు. వేరు అయ్యారు. గోకులంలో సీత హిట్ అయింది. ఆ వెంటనే తొలిప్రేమ పవన్ కు స్టార్ డమ్ ను తీసుకొచ్చింది. ఆ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తో పవన్ కెరీర్ కు బలమైన పునాది వేసింది.

Read Also : Chiranjeevi : పవన్ కల్యాణ్‌ కు చిరంజీవి స్పెషల్ బర్త్ డే విషెస్

దెబ్బకు చిరు తమ్ముడు అనే ట్యాగ్ లైన్ పోయి పవన్ కల్యాన్‌ అనే పేరుతోనే ఫ్యాన్ బేస్ ఏర్పడింది. ఆ తర్వాత వచ్చిన తమ్ముడు సినిమాతో పవన్ కు తిరుగులేని క్రేజ్ వచ్చింది. ఇక పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో వచ్చిన బద్రి సినిమా పవన్ కల్యాన్ ను పవర్ స్టార్ గా మార్చేసింది. అక్కడి నుంచి తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఎంతలా అంటే చిరంజీవి సినిమాల ఈవెంట్ లో పవన్ పేరు మార్మోగిపోయేలా చేసింది. ఆ సినిమాలో రేణు దేశాయ్ తో పరిచయం ప్రేమగా మారి సహజీవనానికి దారి తీసింది. ఆ టైమ్ లోనే ఖుషి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయింది.

యూత్ మొత్తం పవన్ పేరు జపం చేసేలా చేసింది. ఆ తర్వాత మొదటి భార్యతో విడాకులు తీసుకున్నాడు. అప్పటికే అకీరా నందన్ పుట్టడంతో రేణూ దేశాయ్ ను పెళ్లి చేసుకున్నాడు. ఆ గ్యాప్ లో వచ్చిన గుడుంబా శంకర్ భారీ డిజాస్టర్ అయింది. బంగారం, అన్నవరం కూడా అంతంతే ఆడాయి. త్రివిక్రమ్ డైరెక్షణ్ లో వచ్చిన జల్సా డిజాస్టర్ అయింది. కొమరం పులి, తీన్మార్ ప్లాప్ అయ్యాయి. ఆ టైమ్ లోనే రేణూ దేశాయ్ కు విడాకులు ఇవ్వడం ఫ్యాన్స్ కు అస్సలు నచ్చలేదు. ఇలా వరుస డిజాస్టర్లు, విడాకులు పవన్ క్రేజ్ ను మాత్రం తగ్గించలేదు. 2012లో వచ్చిన గబ్బర్ సింగ్ పవన్ కెరీర్ లో మైల్ స్టోన్ గా నిలిచిపోయింది. పదేళ్ల ఫ్యాన్స్ అసంతృప్తి మొత్తాన్ని తీర్చేసింది. 2013లో ఎర్రగడ్డలో ఉన్న రిజిస్టర్ ఆఫీసులో అన్న లెజోవని వివాహం చేసుకున్నారు.

ఆ తర్వాత అత్తారింటికి దారేది ఏకంగా వంద కోట్ల క్లబ్ లో చేరింది. కానీ తర్వాత చేసిన సర్దార్ గబ్బర్ సింగ్, కాటమరాయుడు, అజ్ఞాతవాసి డిజాస్టర్లుగానే నిలిచాయి. ఇలా ఎన్ని ప్లాపులు వచ్చినా పవన్ కల్యాణ్‌ కు ఫ్యాన్ బేస్ తగ్గకపోవడానికి కారణం ఆయన వ్యక్తిత్వం. హీరోగా కంటే వ్యక్తిత్వంతోనే ఎక్కువ పేరు సంపాదించుకున్నాడు. చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించాడు. కానీ ఆ పార్టీని 2011లో కాంగ్రెస్ లో కలిపేయడంతో తీవ్ర నిరాశ చెందాడు పవన్. కొంత టైమ్ తీసుకుని 2014 మార్చి 14న ఒక్కడే అభిమానులు సమక్షంలో జనసేన పార్టీని స్థాపించాడు పవన్. కానీ 2014లో ఎన్నికల్లో పోటీ చేయలేదు. టీడీపీ, బీజేపీ కూటమికి మద్దతు ఇచ్చాడు. రెండేళ్ల తర్వాత నేరుగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. వరుసగా సభలు, సమావేశాలు పెడుతూ 2019 ఎన్నికల్లో పోటీకి సిద్ధం అని ప్రకటించాడు. ఆ ఎన్నికల్లో కమ్యూనిష్టు పార్టీలతో పొత్తులు పెట్టుకుని దారుణంగా ఓడిపోయాడు. పవన్ రెండు చోట్లా ఓడిపోగా.. పార్టీ నుంచి ఒకే ఒక్కడు గెలిచాడు.

ఆ ఓటమితో కుంగిపోలేదు. మళ్లీ ఒంటరిగానే ప్రయాణం ప్రారంభించాడు. నేరుగా జగన్ ను టార్గెట్ చేసుకుని స్పీచ్ లు ఇరగదీశాడు. భారీ సభలు, సమావేశాలో హోరెత్తించాడు. ఫుల్ టైమ్ రాజకీయాలకు అంకితం అయిపోయాడు. కమ్యూనిష్టు పార్టీల నుంచి దూరం అయ్యాడు. 2020లో బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు. రాజకీయాల్లో జనసేన పార్టీకి క్రమంగా మైలేజ్ ను పెంచాడు. జగన్ ను టార్గెట్ చేసుకుని రాజకీయాలు చేయడంతో ప్రజల్లో మంచి ఆదరణ లభించింది.

2021లో వచ్చిన వకీల్ సాబ్ కు తీసుకున్న రెమ్యనరేషన్ తోనే పార్టీని నడిపించాడు పవన్ కల్యాణ్‌. దాని తర్వాత భీమ్లా నాయక్ యావరేజ్ హిట్ అయింది. ఈ సినిమాల తర్వాత 2023 సెప్టెంబర్ నెలలో మాజీ సీఎం చంద్రబాబు అరెస్ట్ అయి జైలుకు వెళ్లారు. పవన్ కల్యాణ్‌ నేరుగా జైలుకు వెళ్లి చంద్రబాబుతో మాట్లాడి పొత్తులు పెట్టుకున్నారు. ఆ పొత్తు ప్రకటన ఏపీ రాజకీయాలను మార్చేసింది. దెబ్బకు ఎన్డీయే కూటమికి తిరుగులేని బేస్ ఏర్పడింది. వ్యతిరేక ఓటు చీలిపోకుండ చేయడంలో పవన్ భారీ సక్సెస్ అయ్యారు. గేమ్ ఛేంజర్ గా మారి కూటమికి 164 సీట్లు రావడంలో కీలక పాత్ర పోషించారు. జనసేన పార్టీ 100 శాతం స్ట్రైక్ రేట్ తో 21 సీట్లు గెలిచింది. పవన్ కల్యాణ్‌ డిప్యూటీ సీఎం అయ్యారు. రాజకీయాల్లో ఇప్పుడు బలమైన నేతగా ఎదిగారు పవన్ కల్యాణ్‌. రీసెంట్ గా భారీ బడ్జెట్ తో వచ్చిన హరిహర వీరమల్లు మిక్స్ డ్ టాక్ సంపాదించుకుంది. ఇప్పుడు సెప్టెంబర్ 25న భారీ అంచనాలతో ఓజీ మూవీ రాబోతోంది. అటు రాజకీయాల్లో బిజీగా ఉంటూనే ఇటు మొదలు పెట్టిన సినిమాలను పూర్తి చేస్తున్నారు పవన్ కల్యాణ్‌. దాని తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ రాబోతోంది. సినిమాల పరంగా, అటు రాజకీయాల పరంగా దూసుకుపోతున్న పవన్ కల్యాణ్‌.. మరింత ఎత్తుకు ఎదగాలని ఆశిద్దాం.. హ్యాప్తీ బర్త్ డే పవన్ కల్యాణ్‌.

Read Also : Bigg Boss 9 : బిగ్ బాస్ లోకి ఆ క్రేజీ బ్యూటీ.. ఇక రచ్చే

Exit mobile version