Pavitra Lokesh: నటి పవిత్రా లోకేష్ కేసు రోజు రోజుకు కీలక మలుపులు తిరుగుతోంది. రెండు రోజుల క్రితం తన ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో తన పరువు తీస్తున్నారని పవిత్ర సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన విషయం విదితమే. నరేష్ తో ఉన్న తన ఫోటోలను వాడి యూట్యూబ్ లో అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారని తెలుపుతూ 15 యూట్యూబ్ ఛానళ్లపై ఆమె కేసు పెట్టింది. అయితే తాజాగా ఈ యూట్యూబ్ ఛానెల్స్ వెనుక నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి హస్తం ఉందని మరోసారి ఫిర్యాదు చేసింది.
మొదటి నుంచి ఆమె తనపై నెగెటివ్ గా మాట్లాడుతుందని, అందరి ముందు తన పరువు తీయాలని చెప్పి కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ కు డబ్బులిచ్చి ఇదంతా చేయిస్తుందని ఆరోపించింది. అంతేకాకుండా గతంలో కూడా తనపై దాడి చేయడానికి కూడా ప్రయత్నించిందని, తనను రోడ్డుకీడ్చింది ఆమెనని చెప్పుకొచ్చింది. ఇక పవిత్ర ఇచ్చిన ఫిర్యాదుపైన కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టినట్లు తెలిపారు. ఇకపోతే రమ్య కొన్నిరోజుల క్రితం నరేష్- పవిత్ర జంటను హోటల్ లో రెడ్ హ్యాండెడ్ గా పెట్టుకున్న విషయం తెల్సిందే. కాగా, ఇప్పటివరకు ఈ విషయమై స్పందించింది లేదు. మరి ఆమె ఎలా స్పందిస్తుందో చూడాలి