Renuka Swamy Case: ఎవర్రా ఈ పవిత్ర గౌడ? టాప్ ట్రెండింగ్‌లోకి దర్శన్ ప్రియురాలు
- టాప్ ట్రెండింగ్‌లోకి దర్శన్ ప్రియురాలు
- ఎవర్రా ఈ పవిత్ర గౌడ అని తెలుసుకోవాలని ప్రజల ఆసక్తి
- పవిత్ర గౌడ ఎవరు ? ఆమె నేపథ్యం ఏమిటి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pavithra Gowda And Her Background Is in Top Trending in Google: కన్నడ సినీ పరిశ్రమలో జూన్ 11 తెల్లవారుజామున ఊహించని తెరమీదకి వార్త వచ్చింది. అదే ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ అరెస్ట్. రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. మైసూరులోని ఓ హోటల్లో దర్శన్‌ను పోలీసులు అరెస్ట్ చేసినట్టుగానే బెంగళూరులో దర్శన్ ప్రియురాలు పవిత్ర గౌడను పోలీసులు అరెస్ట్ చేశారు. రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్ ఏ2 (రెండో నిందితుడు), పవిత్ర గౌడ ఏ1 (మొదటి నిందితుడు. ఈ కారణంగా, జూన్ 11 నుండి ప్రజలు పవిత్ర గౌడ గురించి గూగుల్‌లో ఎక్కువగా శోధిస్తున్నారు.
Vishwak Sen: శవాల మీద పేలాలు.. చెంబుతో బయలుదేరుతున్నారు.. రివ్యూయర్స్ పై విశ్వక్ ఫైర్
Also Read
- SVC 63: టైటిల్ లేదు.. హైప్ మాత్రం పీక్స్‌లో.. మొదలైన సల్మాన్, నయనతారల హై వోల్టేజ్ యాక్షన్
- Tejaswini Nandamuri : బాలయ్య కూతురిని డైరెక్ట్ చేయబోయే దర్శకురాలు ఎవరంటే?
- Karikala First Look: సందీప్ కిషన్ 'కరికాల' ఫస్ట్ లుక్ అదిరింది!.. ఇలాంటి అవతార్‌లో ఎప్పుడూ చూడలే..
- Aishwarya Rajesh : ఫ్లాప్‌లతో డీలా పడిన ఐశ్వర్య రాజేశ్.. పెరిగిన రెమ్యునరేషన్ కష్టాలు
హత్యకి కారణం:
ఈ సంవత్సరం ప్రారంభంలో, స్నేహితురాలు పవిత్ర గౌడ దర్శన్‌తో ఫోటోల కోల్లెజ్తో వీడియో పోస్ట్‌ను షేర్ చేసి “మా బంథానికి 10 సంవత్సరాలు పూర్తయింది” అని కామెంట్ చేసింది. ఆ తర్వాత పవిత్ర గౌడ మొదటి పెళ్లి రహస్యాన్ని విజయలక్ష్మి దర్శన్ బయటపెట్టారు. విజయలక్ష్మి దర్శన్, పవిత్ర గౌడ మధ్య సోషల్ మీడియా వార్ జరిగింది. ఆ సమయంలో చాలా మంది దర్శన్ అభిమానులు విజయలక్ష్మికి అండగా నిలిచారు. పవిత్ర గౌడపై పలువురు విమర్శలు గుప్పించారు. అదే సమయంలో దర్శన్ అభిమాని రేణుకాస్వామి కూడా ‘బాస్ కుటుంబంలో పవిత్ర గౌడ వల్లే చిచ్చు’ అంటూ మండిపడ్డారు. ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి పవిత్ర గౌడపై రేణుకా స్వామి పదే పదే చెడు కామెంట్లు, మెసేజ్ లు చేసినట్లుగా చెబుతున్నారు. దీంతో పవిత్ర ఆదేశాల మేరకు ‘బాస్ దర్శన్ ను కలిపిస్తా’ అంటూ చిత్రదుర్గ దర్శన్ అభిమానుల సంఘం అధ్యక్షుడు రాఘవేంద్ర రేణుకాస్వామిని బెంగళూరు తీసుకొచ్చారు. బెంగళూరు పట్టగెరె షెడ్లో రేణుకాస్వామి హత్య జరిగింది. పట్టనగెరె షెడ్డులో రేణుకాస్వామిని చిత్రహింసలకు గురిచేసి హత్య చేసినట్లు సమాచారం.
అసలు ఎవరు ఈ పవిత్ర గౌడ:
తాళ్లఘట్టాపూర్కు చెందిన పవిత్ర గౌడ నటి కావాలనే కోరికతో సినీ పరిశ్రమకు వచ్చింది. పవిత్ర గౌడ ‘ఛత్రిగు సార్ ఛత్రిగు’, ‘ఆగమ్య’, ‘ప్రీతి కితాబు’, ‘సాగువా దరిలీలు’ వంటి చిత్రాల్లో నటించింది. అయితే పవిత్ర గౌడకు ఏ సినిమా కూడా విజయాన్ని, పేరును తీసుకురాలేదు. దర్శన్‌తో అనుబంధం కారణంగా పవిత్ర గౌడ పేరు చర్చనీయాంశమైంది. పవిత్ర గౌడ సినిమా రంగంలోకి రాకముందే వివాహం చేసుకున్నారు. పవిత్ర గౌడ ఉత్తరప్రదేశ్‌కు చెందిన సంజయ్‌సింగ్‌ను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు యుక్తవయసులో ఉన్న కుమార్తె ఉంది. అయితే పవిత్ర గౌడ సంజయ్ సింగ్ నుండి విడాకులు తీసుకున్నారు. ఇక రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్, పవిత్ర గౌడ చిక్కుకున్న తర్వాత.. పవిత్ర గౌడ ఎవరు, ఆమె నేపథ్యం ఏమిటి? అని తెలుసుకోవాలని ప్రజలు ఆసక్తి కనబరిచారు.
పవిత్ర గౌడ గూగుల్ ట్రెండ్స్‌లో ట్రెండ్ అవుతోంది. జూన్ 11 నుంచి పవిత్ర గౌడ పేరు గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్ చేయబడింది. పవిత్ర గౌడ కర్ణాటకకు చెందినది కావడంతో పవిత్ర గౌడ కర్ణాటకలో టాప్ ట్రెండింగ్‌లో ఉంది. కర్ణాటకలోని 100% ఇంటర్నెట్ వినియోగదారులు పవిత్ర గౌడ కోసం శోధించారు. కర్ణాటక తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో 12%, తెలంగాణలో 11%, కేరళలో 10%, గోవాలో 9% మంది పవిత్ర గౌడ గురించి తెలుసుకోవాలని ఆసక్తి కనబరిచారు. రేణుకాస్వామి హత్యకేసులో ప్రధాన నిందితురాలు పవిత్ర గౌడ, ‘ఛత్రీలు సార్ ఛత్రిలు’, ‘రేణుకాస్వామి’, ‘సంజయ్ సింగ్’, ‘సుదీప్’, ‘తూగుదీప శ్రీనివాస్’ వంటి టాపిక్‌లు గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్ చేయబడ్డాయి. పవిత్ర గౌడ, దర్శన్ పవిత్ర గౌడ సంబంధం, దర్శన్ పవిత్ర గౌడ ఇన్స్టాగ్రామ్ గురించి రేణుకాస్వామి చేసిన వ్యాఖ్యలు గురించి కూడా గూగుల్‌లో ఎక్కువ మంది సెర్చ్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
-
CJI Surya Kant: “యువత మాట వినండి”.. విద్యార్థుల నిరసనలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు..
-
YS Jagan: చంద్రబాబు పాలనలో రైతులు రోడ్డున పడ్డారు.. ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారు!
-
SVC 63: టైటిల్ లేదు.. హైప్ మాత్రం పీక్స్‌లో.. మొదలైన సల్మాన్, నయనతారల హై వోల్టేజ్ యాక్షన్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
ట్రెండింగ్
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్‌కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా వీవీఎస్ లక్ష్మణ్?