Vishwak Sen Fires on Youtube Reviewers: ఈ మధ్యనే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు విశ్వక్సేన్. ఈ సినిమాతో మిశ్రమ స్పందన అందుకున్న ఆయన తాజాగా యూట్యూబ్ లో రివ్యూ చేసే వారిపై విరుచుకుపడ్డాడు. బార్ బెల్ అనే ఒక యూట్యూబర్ కల్కి సినిమాకి సంబంధించిన ఒక వీడియో మీద రివ్యూ చేస్తున్న చిన్న బిట్ షేర్ చేసిన విశ్వక్సేన్ సినిమా రిలీజ్ కూడా అవ్వకముందే చెంబు పట్టుకుని బయలుదేరుతున్నారు యూట్యూబ్ లో మీ ఇన్కమ్ కోసం అంటూ ఫైర్ అయ్యాడు. ఏదైతే ఇండస్ట్రీ వల్ల వేల మంది కుటుంబాలు నడుస్తున్నాయో అదంటే మీకు మజాక్ అయిపోయింది.
Nindha: కాండ్రకోట మిస్టరీనే ‘నింద’.. అస్సలు పోలిక ఉండదు: వరుణ్ సందేశ్ ఇంటర్వ్యూ
వీడు ఒక పది నిమిషాల షార్ట్ ఫిలిం తీస్తే చూద్దాం. మనం లేదంటే అడ్రస్ తప్పిపోయిన వాళ్ళు అనుకుని వదిలేద్దాం. పది నిమిషాల షార్ట్ ఫిలిం తీయండి, ఇలాంటి ఒపీనియన్స్ బయట బజార్ లో పెట్టి తిరిగే వాళ్ళందరూ. ఇక్కడ మన చుట్టూ ఉన్న కొందరు పైరసీ కంటే డేంజరస్. వీళ్లు ఒక ఫిలిం సెట్ లో పనిచేసే వాళ్ళ స్వెట్, బ్లడ్ అలాగే లెక్కలేనన్ని బతుకుదెరువుల గురించి ఆలోచిస్తే మంచిది. నువ్వు తీయు ఒక పది నిమిషాలు షార్ట్ ఫిలిం అప్పుడు నీకు నీ ఒపీనియన్ కి కొంచెం రెస్పెక్ట్ ఉంటది. శవాల మీద పేలాలు ఏరుకునే రకం అంటూ విశ్వక్సేన్ ఒక రేంజ్ లో ఫైర్ అయ్యాడు.