Shaque: అనుమానాలతో పిచ్చెక్కించడానికి వస్తున్న పరిణీతి చోప్రా మిస్టరీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shaque: బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. సినిమాలతో అలరిస్తున్న ఈ బ్యూటీ ఇప్పుడు వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అది కూడా మామూలు కథతో కాదు.. మిస్టరీ, సస్పెన్స్, క్రైమ్ ఎలిమెంట్స్ తో నడిచే థ్రిల్లర్‌తో. ఇన్నాళ్లు టైటిల్ లేకుండా వార్తల్లో ఉన్న ఈ సిరీస్‌కు ఇప్పుడు ‘షాక్: ట్రస్ట్ నో వన్’ (Shaque: Trust No One) అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు మేకర్స్. అంతేకాదు.. ఎప్పుడు, ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో కూడా నెట్‌ఫ్లిక్స్ ఆఫీషియల్ గా వెల్లడించింది. పరిణీతి చోప్రా డిజిటల్ రంగంలోకి అడుగుపెడుతూ నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ డెబ్యూ మిస్టరీ థ్రిల్లర్ సిరీస్ ‘షాక్: ట్రస్ట్ నో వన్’ ప్రపంచవ్యాప్తంగా నెట్‌ఫ్లిక్స్ (Netflix) వేదికగా 2026 సెప్టెంబర్ 24 నుండి స్ట్రీమింగ్ కాబోతోంది. ‘హిచ్కీ’ ఫేమ్ సిద్ధార్థ్ పి. మల్హోత్రా క్రియేటర్‌గా వ్యవహరించిన ఈ ప్రతిష్టాత్మక సిరీస్‌కు ప్రముఖ దర్శకుడు రెన్సిల్ డిసిల్వా (Rensil D’Silva) దర్శకత్వం వహించగా, పరిణీతితో పాటు జెనిఫర్ వింగెట్, తాహిర్ రాజ్ భాసిన్, సోని రజ్దాన్ మరియు సుమీత్ వ్యాస్ వంటి భారీ తారాగణం ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు.
కథ విషయానికి వస్తే.. ఈ సిరీస్ స్టోరీ కూడా ఎవరిని నమ్మాలి, ఎవరిని అనుమానించాలి అనే ప్రశ్నల చుట్టూనే తిరిగేలా కనిపిస్తోంది. తప్పిపోయిన తన ఐదేళ్ల చిన్నారి కోసం తొమ్మిదేళ్లుగా అలుపెరగకుండా అన్వేషిస్తున్న ఒక కన్నతల్లి (పరిణీతి చోప్రా) చుట్టూ కథ తిరుగుతుంది. ఆ పాప గురించిన కొన్ని నిజాలు బయటకు వస్తున్న తరుణంలో, ఆమె తన చుట్టూ ఉన్న అత్యంత ఆప్తులను, సొంత బంధువులను కూడా నమ్మలేని ఒక భయంకరమైన నమ్మకద్రోహాల వలయంలో చిక్కుకుంటుంది.
బిడ్డ కోసం ఆమె వెతుకుతున్న కొద్దీ కొత్త విషయాలు బయటపడతాయి. చివరికి తాను చూస్తున్నది నిజమేనా? తన చుట్టూ ఉన్న వారిలో ఎవరిని నమ్మాలి? అనే అనుమానాలు మొదలవుతాయి. ఈ క్రమంలో కథ ఊహించని మలుపులతో సస్పెన్స్‌గా మారనుంది. చివరికి తన బిడ్డ కోసం ఓ తల్లి చేసే అన్వేషణ ఎలాంటి మలుపులు తిరుగుతుంది? అసలు నిజం ఏంటి? ఎవరు మోసగాళ్ళు ? ఎవరు నమ్మదగిన వాళ్ళు తెలియాలంటే సెప్టెంబర్ 24 వరకు వెయిట్ చేయాల్సిందే. నెట్‌ఫ్లిక్స్ ఈ సిరీస్‌ను సైకలాజికల్ మిస్టరీ, క్రైమ్ థ్రిల్లర్‌గానే ఆడియన్స్ ముందుకు తీసుకొస్తోంది. ఇక ఓటీటీ లవర్స్ కి సరికొత్త థ్రిల్లర్ కంటెంట్ దొరికనట్టే కనిపిస్తోంది.
Also Read
- JrNTR : ఆదర్శకుటుంబానికి తోడుగా యంగ్ టైగర్ ఎన్టీఆర్
- Mirzapur The Movie: థియేటర్లలో ‘మిర్జాపూర్’ మాస్ జాతర!.. మూడు రోజుల్లోనే రూ.100 కోట్లకు..
- Ameesha Patel: ‘ఆంటీ’ అంటూ ట్రోల్.. హార్దిక్‌తో లింకప్ రూమర్స్‌పై అమీషా స్ట్రాంగ్ కౌంటర్!
- Toxic OTT : రూ. 150 కోట్ల నుండి రూ. 30 కోట్లకు పడిపోయిన టాక్సిక్ OTT ఆఫర్!
తాజావార్తలు
-
Shaque: అనుమానాలతో పిచ్చెక్కించడానికి వస్తున్న పరిణీతి చోప్రా మిస్టరీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
-
Best Scooters for Women: మహిళలకు బెస్ట్ స్కూటర్లు ఇవే.. స్టైలిష్ లుక్, మంచి మైలేజ్‌తో అదిరిపోయే మోడల్స్!
-
Bhatti Vikramarka: సింగరేణి 128 మంది ఉద్యోగుల భవితవ్యంపై నిర్ణయం.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన.!
-
JrNTR : ఆదర్శకుటుంబానికి తోడుగా యంగ్ టైగర్ ఎన్టీఆర్
-
Asia Cup 2026: జిత్తులమారి వస్తున్నాడు.. టీమిండియాకు మరోసారి ట్రోఫీ వివాదం తప్పదా?
ట్రెండింగ్
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!
-
990 గ్రా.లకే ThinkBook..! మైండ్ బ్లోయింగ్ ఫీచర్స్‌తో Lenovo IdeaPad Vibe సిరీస్ వచ్చేసింది.!
-
JIO: అదిరిపోయే ఆఫర్.. 5TB క్లౌడ్ స్టోరేజ్, 18 నెలల AI సబ్స్క్రిప్షన్, 2.5GB డైలీ డేటాతో ఏడాదిపాటు..!