Pallavi Prashanth: రైతు బిడ్డ ఒరిజినాలిటీ.. విన్నర్ అయ్యాక బలుపు చూపిస్తున్న పల్లవి ప్రశాంత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pallavi Prashanth: ఏరు దాటేవరకు ఓడ మల్లయ్య.. ఏరు దాటాక బోడి మల్లయ్య.. ఈ సామెత వినే ఉంటారు. ప్రస్తుతం బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ కు ఈ సామెత చక్కగా సరిపోతుంది. అన్నా.. మా పొలంలో నీళ్లు రాలేదు.. పంట పండలేదు.. రైతులు ఎన్ని కష్టాలు పడుతున్నారో అంటూ వీడియోలు తీసి పోస్ట్ చేసుకొనే కుర్రాడు.. గత మూడు సీజన్లుగా బిగ్ బాస్ హూసు కు వెళ్ళడానికి అందరిని అడిగి అడిగి.. ఇంటర్వ్యూలు ఇచ్చి.. ఏడ్చి రచ్చచేసి.. ఎట్టకేలకు బిగ్ బాస్ సీజన్ 7 లో కంటెస్టెంట్ గా అడుగుపెట్టాడు. ఒక రైతు బిడ్డగా.. కామన్ మ్యాన్ గా హౌస్ లోకి వెళ్లడంతో అందరి చూపు అతనిపై పడింది. ఇక నోట్లో నాలుక లేనివాడిగా.. అమాయకుడిగా నటిస్తూ.. అటు అభిమానులనే కాదు శివాజీని కూడా బుట్టలో వేసుకున్నాడు. అతడు తనకు సపోర్ట్ చేసేలా చేసుకొని.. చివరికి జనాలు ఇచ్చిన సపోర్ట్ తో విన్నర్ గా బయటకు వచ్చాడు.
ఇక్కడ వరకు బాగానే ఉన్నా.. బయటకు వచ్చాకా.. ప్రశాంత్ ఒరిజినాలిటీ బయటపడింది. విన్నర్ అవ్వడం తోనే బలుపు చూపించడం మొదలుపెట్టాడు. బయటకు రావడంతోనే పోలీసులతో వాగ్వాదం పెట్టుకున్నాడు. ఇంటికి వెళ్ళమని పోలీసులు చెప్పినా.. పట్టించుకోకుండా మళ్లీ వెనక్కి వచ్చి రచ్చ చేశాడు.. మాట్లాడితే రైతుబిడ్డలను పట్టించుకోరా.. అని పోలీసులకు ఎదురుతిరిగి కేసులు పెట్టించుకొనేవరకు వెళ్ళాడు. సర్లే ఇదంతా ఎప్పుడు ఉండేదే కదా అని అనుకుంటే.. విన్నర్ గా అయ్యాక.. ప్రశాంత్ కళ్ళు నెత్తికి ఎక్కాయని పలువురు విమర్శిస్తున్నారు. ఇంటికి వెళ్ళాక.. స్నేహితులను దూరం పెట్టాడు.. బిగ్ బాస్ హౌస్ లోపలికి వెళ్ళడానికి హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరిని మరిచి.. తాను విజయం అందుకున్నట్లు గర్వం చూపిస్తున్నట్లు చెప్పుకొచ్చారు.
Also Read
- Samantha Seemantham: శ్రీవిద్య పద్ధతిలో సమంత సీమంతం.. "నా బిడ్డకు దక్కిన వరం" అంటూ ఎమోషనల్ పోస్ట్!
- The Paradise: ఆడియన్స్ కోసమే ఆ రిస్క్ చేశాం.. 'ది ప్యారడైజ్' షూటింగ్ డిలే వెనుక అసలు నిజాలు చెప్పిన శ్రీకాంత్ ఓదెల!
- Srikanth Odela: ఒకప్పుడు సుకుమార్ శిష్యుడిగా.. ఇప్పుడు ఆయన కుర్చీలో డైరెక్టర్‌గా.. శ్రీకాంత్ ఓదెల లైఫ్ సర్కిల్ మూమెంట్!
- Ram Charan: మెగాస్టార్ ఇంట్లో వినాయక చవితి వేడుకలు.. ఫ్యామిలీతో కలిసి రామ్ చరణ్ ప్రత్యేక పూజలు! వైరల్ వీడియో..
ఒకప్పుడు పల్లవి ప్రశాంత్ అనే వ్యక్తిని ఇంటర్వ్యూ చేసి అందరికి తెలిసేలా చేసింది యాంకర్ శివ. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు రాగానే మొదటి ఇంటర్వ్యూ తనకే ఇస్తాను అని చెప్పిన ప్రశాంత్ మాట తప్పాడు. శివకు ఇంటర్వ్యూ ఇస్తాను అని చెప్పి ఇంటికి పిలిచి.. 8 గంటలు ఎదురుచూసేలా చేసి.. చివరికి ఇంటర్వ్యూ ఇవ్వకుండా పంపించేశాడు. దీంతో శివ తన ఆవేదనను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. “ప్రశాంత్.. 18 గంటలు వెయిట్ చేయించి ఇంటికి రా అన్నా.. ఇంటర్వ్యూ ఇస్తా అని పిలిచాడు. తీరా అక్కడికి వెళ్తే ఇంటి బయట 8 గంటలు కూర్చోబెట్టి ఇంటర్వ్యూ ఇవ్వను.. వెళ్లిపోమని దురుసుగా మాట్లాడాడు. గొప్ప విన్నర్ ప్రశాంత్.. అక్కడే ఉన్న తన స్నేహితులను కూడా అతడు లెక్క చేయడం లేదు.. ఇవన్నీ నాకు ఇంటర్వ్యూ ఇవ్వలేదని పెట్టలేదు.. ఇవ్వను అని చెప్పే విధానం బాలేదు” అని వాపోయాడు. దీంతో ఇది రైతు బిడ్డ ఒరిజినాలిటీ.. విన్నర్ అయ్యాక బలుపు చూపిస్తున్నాడు అంటూ చెప్పుకొస్తున్నారు.
తాజావార్తలు
-
Varun Chakaravarthy: చెడ్డ బంతికి వికెట్ వస్తే ఆనందించను.. కారణమేంటో చెప్పిన వరణ్ చక్రవర్తి..
-
Samantha Seemantham: శ్రీవిద్య పద్ధతిలో సమంత సీమంతం.. “నా బిడ్డకు దక్కిన వరం” అంటూ ఎమోషనల్ పోస్ట్!
-
The Paradise: ఆడియన్స్ కోసమే ఆ రిస్క్ చేశాం.. ‘ది ప్యారడైజ్’ షూటింగ్ డిలే వెనుక అసలు నిజాలు చెప్పిన శ్రీకాంత్ ఓదెల!
-
Pakistan: పాకిస్తాన్‌కు FATF భయం.. జైష్ చీఫ్ మసూద్ అజర్‌పై బౌంటీ పెంపు..
-
Srikanth Odela: ఒకప్పుడు సుకుమార్ శిష్యుడిగా.. ఇప్పుడు ఆయన కుర్చీలో డైరెక్టర్‌గా.. శ్రీకాంత్ ఓదెల లైఫ్ సర్కిల్ మూమెంట్!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!