Virat Kohli: చిన్నారి ప్రశ్నకు విరాట్ సమాధానం.. ఆర్యవీర్ సెహ్వాగ్‌కు కోహ్లీ ఇచ్చిన సలహా ఇదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Virat Kohli: భారత క్రికెట్ దిగ్గజం వీరేంద్ర సెహ్వాగ్ తనయుడు ఆర్యవీర్ సెహ్వాగ్ (Aaryavir Sehwag) ఇప్పుడు క్రికెట్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారాడు. తాజాగా అండర్-19 ఆసియా కప్ 2026 (U19 Asia Cup 2026) టోర్నీలో యూఏఈ (UAE) జట్టుపై 160 పరుగుల భారీ ఇన్నింగ్స్ ఆడి తన సత్తా ఏంటో మరోసారి నిరూపించుకున్నాడు. ఈ అద్భుతమైన ఇన్నింగ్స్ తర్వాత, గతంలో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీతో (Virat Kohli) ఆర్యవీర్ చేసిన ఓ పాత ఇంటర్వ్యూ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఆ వైరల్ వీడియోలో చిన్నప్పటి ఆర్యవీర్, విరాట్ కోహ్లీని ఇంటర్వ్యూ చేస్తూ కనిపించాడు. “మీరు 14 లేదా 15 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఆశిష్ నెహ్రా (Ashish Nehra) చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. ఆ తర్వాత ఆయనే మీ కెప్టెన్సీలో ఆడినప్పుడు మీకు ఎలా అనిపించింది?” అని ఆర్యవీర్ కోహ్లీని ప్రశ్నించాడు. దీనికి కోహ్లీ బదులిస్తూ.. నేను ఎప్పుడూ ఒకటే చెబుతాను.. నేను ఏదైనా చేయలగనని నమ్ము. ఎల్లప్పుడూ పాజిటివ్‌గా ఆలోచించు” అంటూ ఆర్యవీర్‌కు విలువైన సలహా ఇచ్చాడు. ఇప్పుడు ఆర్యవీర్ ఆటతీరు చూస్తుంటే, కోహ్లీ ఇచ్చిన ఆ సలహాను అతడు బాగా వంటబట్టించుకున్నట్లు కనిపిస్తోంది. అంటే, మనం ఒకప్పుడు ఎవరినైతే ఆదర్శంగా తీసుకుని అవార్డులు అందుకున్నామో, మనపై మనకు పూర్తి నమ్మకం ఉంటే భవిష్యత్తులో వారికే నాయకత్వం వహించే స్థాయికి కూడా ఎదగగలమని కోహ్లీ ఈ మాట ద్వారా చెప్పకనే చెప్పాడు.
Also Read
- వైభవ్ నుండి సూర్యకుమార్ వరకు.. స్టార్ క్రికెటర్ల సందడి..! SMAT 2026లో 34 జట్ల వివరాలు ఇవే..
- Airtel Beats Jio: జియోకు షాకిచ్చిన ఎయిర్టెల్.. బ్రాడ్‌బ్యాండ్ స్పీడ్, నెట్వర్క్ క్వాలిటీలో నెం.1గా..!
- CII Partnership Summit: 141 ఒప్పందాలు.. 2.46 లక్షల ఉద్యోగాలు.. విశాఖలో పెట్టుబడుల పండుగ!
- IPL 2027 Auction: ఐపీఎల్ 2027 వేలానికి బీసీసీఐ గ్రీన్ సిగ్నల్? వేలంలో 7 మంది బంగ్లాదేశ్ ఆటగాళ్లు..!
ఇక మ్యాచ్ విషయానికొస్తే, అల్ అమెరాత్ క్రికెట్ గ్రౌండ్లో (Al Amerat Cricket Ground) జరిగిన ఈ పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన భారత అండర్-19 జట్టు (India U19) నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 309 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ ఆర్యవీర్ 168 బంతుల్లో 160 పరుగులు చేసి జట్టు ఇన్నింగ్స్‌ను ముందుండి నడిపించాడు. అతనికి తోడుగా మూడో స్థానంలో వచ్చిన వీకే వినీత్ (VK Vineeth) 69 బంతుల్లో 67 పరుగులతో రాణించాడు. వీరిద్దరూ కలిసి మూడో వికెట్‌కు ఏకంగా 193 పరుగుల భాగస్వామ్యాన్ని (Partnership) నెలకొల్పి జట్టుకు భారీ స్కోరుకు గట్టి పునాది వేశారు.
అనంతరం 310 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన యూఏఈ అండర్-19 జట్టును భారత బౌలర్లు కట్టడి చేశారు. రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ ఇషాన్ సూద్ (Ishan Sood) 7 ఓవర్లలో 37 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టి యూఏఈ పతనాన్ని శాసించాడు. మిగతా ఆరుగురు బౌలర్లు కూడా తలో వికెట్ తీయడంతో యూఏఈ జట్టు 239 పరుగులకే ఆలౌటైంది. దీంతో భారత్ 70 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో భారత అండర్-19 జట్టు టోర్నీ సెమీఫైనల్స్‌లో (Semi-Finals) తమ స్థానాన్ని ఖాయం చేసుకుంది. లీగ్ దశలో పాకిస్థాన్ అండర్-19 (Pakistan U19) చేతిలో స్వల్ప తేడాతో ఓడినప్పటికీ, నేపాల్ (Nepal U19), యూఏఈలపై విజయాలతో గ్రూప్-ఏలో (Group A) రెండో స్థానంలో నిలిచింది. మొత్తం మూడు మ్యాచ్‌లలో రెండు విజయాలు సాధించిన ఎనిమిది సార్లు ఛాంపియన్ భారత్, గురువారం జరగనున్న సెమీఫైనల్ పోరులో ఆఫ్ఘనిస్థాన్ అండర్-19 (Afghanistan U19) జట్టుతో తలపడనుంది.
తాజావార్తలు
-
Virat Kohli: చిన్నారి ప్రశ్నకు విరాట్ సమాధానం.. ఆర్యవీర్ సెహ్వాగ్‌కు కోహ్లీ ఇచ్చిన సలహా ఇదే..
-
వైభవ్ నుండి సూర్యకుమార్ వరకు.. స్టార్ క్రికెటర్ల సందడి..! SMAT 2026లో 34 జట్ల వివరాలు ఇవే..
-
Airtel Beats Jio: జియోకు షాకిచ్చిన ఎయిర్టెల్.. బ్రాడ్‌బ్యాండ్ స్పీడ్, నెట్వర్క్ క్వాలిటీలో నెం.1గా..!
-
Infinix Xpad 30: 11 ఇంచుల FHD+ డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో Infinix Xpad 30 ట్యాబ్లెట్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
CII Partnership Summit: 141 ఒప్పందాలు.. 2.46 లక్షల ఉద్యోగాలు.. విశాఖలో పెట్టుబడుల పండుగ!
ట్రెండింగ్
-
iPhoneకు పోటీగా Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. Motorola Razr Flex పేరుతో రంగం సిద్ధం..!
-
Captain Sanju Samson: పుట్టినరోజున కెప్టెన్‌గా సంజూ శాంసన్‌కు ప్రమోషన్..
-
Egg Lababdar Recipe: ఎగ్ లవర్స్ కోసం పర్ఫెక్ట్ డిష్.. రెస్టారెంట్ స్టైల్ సూపర్ టేస్టీ “ఎగ్ లబాబ్దార్” సులువుగా చేసుకోండి ఇలా..!
-
How to Make Hara Saag: పప్పు తిని విసుగొచ్చిందా? తాజా ఆకుకూరలతో వింటర్ స్పెషల్ డిష్ ట్రై చేయండి..
-
IPL 2027 Trade: పంజాబ్ కింగ్స్‌కు హార్థిక్ పాండ్యా.. ముంబైకి ఆర్షదీప్ సింగ్.. ఇట్స్ అఫీషియల్..!