Maruva Tarama: అద్వైత్ ధనుంజయ హీరోగా, అతుల్యా చంద్ర, అవంతిక నల్వా హీరోయిన్లుగా తెరకెక్కుతున్న సినిమా ‘మరువతరమా’. గిడుతూరి రమణమూర్తి, రుద్రరాజు విజయ్ కుమార్ రాజు నిర్మిస్తున్న ఈ మూవీకి చైతన్య వర్మ నడింపల్లి దర్శకుడు. షూటింగ్ ముగించుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ ఇటీవల విడుదలైంది. ‘పాదం పరుగులు తీసే…’ అంటూ సాగే ఈ గీతాన్ని దర్శకుడు చైతన్య వర్మ రాయగా, విజయ్ బుల్గనిన్ స్వరపరిచాడు. ఈ స్వీట్ మెలోడీని పి.వి.ఎన్.ఎస్. రోహిత్ ఆలపించాడు. ఫ్రెష్ ఫీల్ తెప్పిస్తున్న మ్యూజిక్ ఈ సాంగ్‌కి ప్రాణం పోసింది. ఇక పాటలో చూపించిన అందమైన లొకేషన్స్ హైలైట్ అయ్యాయి. లవర్స్ నడుమ జరిగే రొమాంటిక్ మూమెంట్స్ చాలా నాచురల్ గా చూపించారు. హైదరాబాద్ చారిత్రక కట్టడం చార్మినార్ వద్ద హీరో హీరోయిన్ లిప్ కిస్ సీన్ పాటలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. మొత్తంగా చూస్తే ఈ సాంగ్ యువత మనసు దోచేయడమే గాక సినిమాపై హైప్ తీసుకొచ్చేలా ఉంది. యూత్ కోరుకునే అన్ని అంశాలు ‘మరువతరమా’లో ఉన్నాయని, తాజాగా విడుదల చేసిన సాంగ్ కు సోషల్ మీడియాలో సూపర్ రెస్పాన్స్ వస్తోందని, అతి త్వరలోనే మూవీ రిలీజ్ ను ప్రకటిస్తామని దర్శక నిర్మాతలు తెలిపారు.